Home

»

Latest News

పబ్ పై దాడి చేసి అరెస్టైన హీరో ఉదయ్ కిరణ్

Mar 24, 2016 8:25PM

వర్ధమాన నటుడు ఉదయ్ కిరణ్ నండూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రెండ్స్ బుక్ అనే సినిమాలో హీరోగా చేసిన ఉదయ్ అలియాస్ బాబీ, గత రాత్రి దసపల్లా హోటల్లో తాగి హడావిడి చేశాడు. హోటల్ సిబ్బందిపై దాడి చేయడమే కాక, అక్కడున్న స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు చెబుతున్నారు. హోటల్ సిబ్బంది కంప్లైంట్ తో అతన్ని అదుపులోకి తీసుకున్నామని, గతంలో కూడా డ్రగ్స్ సరఫరా విషయంలో తమకు అతడు దొరికాడని అంటున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. మరో వైపు ఉదయ్ కిరణ్ మాత్రం, అలాంటిదేమీ లేదని, తాను మద్యం సేవించలేదని, సక్రమంగానే ఉన్నానని, తనపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని తెలిపాడు. కాగా ఏడాది క్రితం, పబ్ లో తనపై ఉదయ్ దాడి చేశాడని నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రవీణ్ కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు. అప్పట్లో పోలీసులు ఉదయ్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com