Home

»

Latest News

మెగాస్టార్ చిరంజీవి భుజానికి మళ్లీ ఆపరేషన్..!

Mar 25, 2016 10:57AM

శ్రీజ పెళ్లిపనులకు మందే చిరంజీవి తన కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. దశాబ్దాల పాటు అవిరామంగా కష్టపడటంతో, ఆ ఒత్తిడి ఆయన భుజాలపై ఎఫెక్ట్ చూపించిందని, ఆపరేషన్ చేయించుకోవడమే మంచిదని డాక్టర్లు చెప్పడంతో, చిరు శస్త్రచికిత్స చేయించుకున్నారు. శ్రీజ పెళ్లిపనుల్లో కూడా చిరు కట్టుతోనే పాల్గొన్నారు. ప్రస్తుతం కట్టు లేకపోయినా నొప్పి అలాగే ఉందని, భుజానికి మరో ఆపరేషన్ పడుతుందని సమాచారం. పెళ్లి హడావిడి ముగిసిన తర్వాత మరోసారి భుజానికి ఆపరేషన్ చేయించుకోబోతున్నారట మెగాస్టార్. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఈ సర్జరీ జరగనుంది. సర్జరీ నుంచి కోలుకోగానే, ఆయన కత్తి పనులు ప్రారంభిస్తారని సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com