Home

»

Latest News

ఓటీటీలో రచ్చలేపుతున్న మలయాళ సైకో థ్రిల్లర్: వాళ్ళు ఆ...సుఖాన్ని ఎలా తీర్చుకుంటారో తెలుసా!

Sep 29, 2026 4:59PM


రొటీన్ సినిమాలు చూస్తే ఏం లాభం..చూస్తే ఇలాంటి సినిమా చూడాలి. చూసాక మీరు పొందే అనుభూతిని మీకే వదిలేస్తున్నాం. అంతలా మెస్మరైజ్ చేయడంలో ఏ మాత్రం నిరుత్సాహపరచదు. మరి ఆ మూవీ ఏంటో చూద్దాం.

ఉడల్.. డబ్బు, వివాహేతర సంబంధాల మోజులో పడి తమ కుటుంబాన్ని కొందరు మహిళలు ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే పాయింట్ తో తెరకెక్కింది. గత మూడేళ్లుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తూ, ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపుతున్న మలయాళ సైకో డార్క్ థ్రిల్లర్. 2022 మే 20న విడుదలై బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకే ఇంట్లో, కేవలం 2 గంటల వ్యవధిలో సాగే ఈ అరాచక కథనం ప్రేక్షకులకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా రొమాన్స్, మోసం, క్రూరమైన హత్యలు, రక్తం చిందించే రివేంజ్ డ్రామాతో భయపెడుతుంది. 


ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్: రామాయణ పార్ట్ 1 ప్రీ పోన్!

 

 


 కథ విషయానికి వస్తే షైనీ (దుర్గా కృష్ణ), రెజీ (జూడ్ ఆంటోని జోసెఫ్) దంపతులు. వీరికి ఐదేళ్ల కొడుకు ఉంటాడు. రెజీ తన భార్య, పిల్లాడిని తన తల్లిదండ్రులతోపాటే వదిలేసి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తాడు. అలాగే ఆమె అత్త మంచానికే పరిమితమై ఉంటుంది. దీంతో ఆమెకు సేవలు చేయడానికి రెజీ విసుక్కుంటుంది. మరోవైపు మామకు కన్ను సరిగ్గా కనిపించదు. అదే సమయంలో తన పాత కాలేజీ స్నేహితుడు (ధ్యాన్ శ్రీనివాసన్ ) తిరిగి పరిచయం కావడం.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఒక రోజు తన అత్తను ప్రియుడితో కలిసి చంపేస్తుంది. కానీ కోడలు చేసిన ఈ హత్యను తన మామ చూస్తాడు. తన భార్యను చంపిన తన కోడలిని, ఆమె ప్రియుడిని ఎలాగైనా అంతం చేయాలనుకుంటాడు. ఇక అప్పుడే అసలు కథ మొదలవుతుంది. సస్పెన్స్, థ్రిల్లర్ మధ్య ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది.  డబ్బు, వివాహేతర సంబంధాల మోజులో అమ్మాయిలు ఎలా పడతారో క్లియర్ గా చూపించారు. డోంట్ మిస్. 

 

[Udal Malayalam Dark Thriller Ott Sensation, Udal Malayalam movie, Best suspense movies OTT,Amazon Prime Malayalam thrillers, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com