
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు హీరో సూర్య ధన్యవాదాలు తెలిపారు. మనం ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో సూర్య నటించిన 24 సినిమాను నిన్న కేటీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి వీక్షించారు. సినిమా చూసిన అనంతరం సూర్యపై తన ట్వీట్టర్ ఖాతాలో ప్రశంసల జల్లు కురిపించారు కేటీఆర్. ఈ ట్వీట్‌పై స్పందించిన సూర్య, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. "థాంక్యూ మచ్ సార్! సో గ్లాడ్ ఆల్ లైక్‌డ్ 24" అంటూ పోస్ట్ చేశారు.






.jpg)
