ఆడియో డేట్ ఫిక్స్ చేసిన మెగా హీరోయిన్..
on May 11, 2016
.jpg)
మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల, నాగశౌర్య నటించిన "ఒక మనసు" సినిమా గురించి ఇండస్ట్రీతో పాటు మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో డేట్‌ను రిలీజ్ చేసింది నిహారిక. ఈ నెల 18న ఒక మనసు ఆడియోను హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు నిహారిక తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ కొత్త పోస్టర్‌ను ఆమె అభిమానులతో పంచుకున్నారు. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఫేమ్ రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా...టీవీ9తో కలిసి మధుర శ్రీధర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



