Home

»

Latest News

Trisha: దళపతి విజయ్ కోసం 12 కోట్ల భారీ ఆఫర్‌  తిరస్కరించిన త్రిష!

May 16, 2026

 


 త్రిష(Trisha)ప్రస్తుతం సూర్య(Suriya)తో కలిసి వీరభద్రుడి(Veerabhadrudu)తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. రీసెంట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కోసం  పన్నెండు కోట్ల రూపాయల వరకు వదులుకుందనే న్యూస్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజెన్స్ ని షాక్ కి గురి చేస్తుంది. మరి పూర్తి న్యూస్ ఏంటో చూద్దాం.


కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి మల్టి స్టారర్ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ రాజకీయ ప్రత్యర్థి డిఎంకె నేత, ఎంఎల్ఏ ఉదయనిధి స్టాలిన్‌ తన  రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం కోసమే త్రిషకి  12 కోట్ల భారీ డీల్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే విజయ్‌తో ఉన్న సుదీర్ఘ కాలపు స్నేహం,  విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మరియు అధికార డీఎంకే వర్గానికి మధ్య తీవ్రమైన రాజకీయ పోటీ నెలకొన్న ఈ తరుణంలో, ప్రత్యర్థి క్యాంప్‌లో సినిమా చేయడం సరికాదని త్రిష భావించినట్లుగా తెలుస్తుంది.


Also read: Manchu Manoj: మంచు మనోజ్ టీమ్ లో మిస్టరీ డెత్.. చంపారా! చనిపోయాడా!

తన అత్యంత ఆప్తమిత్రుడు, రాజకీయాల్లో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయ్ సెంటిమెంట్లను గౌరవిస్తూ, ఆయనకు నైతిక మద్దతుగా నిలిచేందుకే త్రిష ఈ అత్యంత భారీ పారితోషికాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడిందని చెన్నై వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. కేవలం డబ్బు కంటే స్నేహానికి, నమ్మకానికి ఆమె ఇచ్చిన ప్రాధాన్యతను చూసి అభిమానులు సోషల్ మీడియాలో నీరాజనాలు పడుతున్నారు. ఏదేమైనా ఒక హీరోయిన్ కేవలం రాజకీయ సమీకరణాలు మరియు స్నేహం కోసం  12 కోట్ల ఆఫర్‌ కి  నో అని చెప్పడం ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com