
త్రిష(Trisha)..కేవలం పేరు కాదు బ్రాండ్ అనే విషయం రెండుదశాబ్దాల క్రితమే అందరకి తెలిసేలా చేసింది. ప్రస్తుతం కరుప్పు ఉరఫ్ వీరభద్రుడుతో థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ వీరభద్రుడు త్రిషకి ఒక సరికొత్త రికార్డు కట్టబెట్టాడు. దీంతో ఇప్పుడు త్రిష పేరు తమిళనాట ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. మరి ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం
కరుప్పు(Karuppu)ముందు వరకు సూర్య(Suriya)వరుస ప్లాప్స్ తో ఉన్నాడు. దీంతో కరుప్పు విజయం చాలా అవసరమైంది. అలాంటి టైంలో కరుప్పులో త్రిష చెయ్యడం కరుప్పు ఘన విజయం సాధించింది. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కూడా. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'మౌనమ్ పేసియాధే' సూర్యకి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హరి దర్శకత్వంలో వచ్చిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆరు' మాస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ 100 రోజులకు పైగా ఆడి బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఆ వెంటనే వచ్చిన 'మౌన గురు' కూడా విజయాన్ని అందుకుంది. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత కలిసినా కూడా సక్సెస్ ని అందుకుంది
విజయ్(Vijay),త్రిషల కాంబినేషన్‌కు కోలీవుడ్‌లో తిరుగులేని 100 శాతం క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'గిల్లి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 'తిరుపాచి', 'కురువి' వంటి చిత్రాలు కూడా విజయ్‌కు మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం 'లియో' సినిమా కోసం ఈ జంట మళ్లీ జతకట్టింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. త్రిష లక్కీ హ్యాండ్ సెంటిమెంట్‌ను మరోసారి నిరూపించింది.
మరోవైపు థలా అజిత్ తో కూడా త్రిషకు అద్భుతమైన సక్సెస్ రేట్ ఉంది. అజిత్(Ajith)కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'జీ', 'కిరీడం''ఎన్నై అరిందాల్' (తెలుగులో ఎంతవాడు గానీ) లలో అజిత్, త్రిషల కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా క్లాసికల్ హిట్‌గా నిలిచింది. ఇక అజిత్ ప్రీవియస్ హిట్ ' గుడ్ బాడ్ అగ్లీ' . ఈ చిత్రం ముందు అజిత్ వరుస ప్లాప్స్ లో ఉన్నాడు. అలాంటిది ఈ చిత్రంలో త్రిష జత కట్టింది. అజిత్ కి హిట్ ని తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు త్రిషని అదృష్టదేవత అని పిలుచుకుంటున్నారు.






