కుక్కకు స్నానం చేయించిన త్రిష
on Apr 8, 2020
కథానాయిక త్రిషకు ముందునుంచీ మూగజీవాలు అంటే ఎంతో ప్రేమ. జంతు సంరక్షణ కోసం ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ ‘పెటా’ తరపున ఆమె పని చేశారు. ఇప్పటికీ ‘పెటా’కు మద్దతు ఇస్తారు. ఇవన్నీ పక్కన పెడితే... త్రిష ఇంట పెంపుడు జీవులు కూడా ఎక్కువే. షూటింగులు ఉన్నప్పుడు ఒత్తిడి నుండి ఉపశమనం కోసం తన పెంపుడు జీవులతో అప్పుడప్పుడూ ఆడుకుంటానని త్రిష చెబుతుండేవారు. లాక్డౌన్ కారణంగా ఇప్పుడు షూటింగులకు బ్రేక్ పడింది.
ఖాళీ సమయంలో ఇంటిలోని పెంపుడు జంతువులతో ఆడుకుంటున్న త్రిష, స్నానాలు గట్రా కూడా చేయిస్తున్నారు. పెంపుడు కుక్కకు స్నానం చేయిస్తున్నప్పుడు వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. హీరోయిన్లు ఏం చేసినా అందంగానే ఉంటుంది కదా! జనాలకు నచ్చుతుంది.