Home

»

Latest News

‘త్రిపుర’రివ్యూ రిపోర్ట్ : బోరింగ్‌ థ్రిల్లర్‌

Nov 6, 2015 5:25PM

హారర్ కామెడీ 'గీతాంజలి'తో ఘన విజయాన్ని అందుకున్న రాజ కిరణ్‌ తన రెండో ప్రయత్నంలోను హారర్‌ జోనర్‌నే ఎంచుకున్నాడు. ఈ ట్రెండ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు చాలా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. మరి సేమ్ థీమ్‌తో రిలీజైన ‘త్రిపుర’కి రివ్యూ రిపోర్ట్స్ ఎలా వచ్చాయో చూద్దాం. దర్శకుడు రాజ కిరణ్‌ ఈ చిత్రాన్ని ఎలా తీయాలో తెలియక చాలా కన్‌ఫ్యూజ్‌ అయ్యాడట. ఎలిమెంట్స్‌ ఏవీ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చేసి థ్రిల్‌ చేయలేదట. ఈ చిత్రంలో భయపెట్టే మూమెంట్స్‌ నామమాత్రంగా కూడా లేకపోవడం, ఇలాంటి సినిమాలు పాస్‌ అయిపోవడానికి బాగా పనికొస్తున్న కామెడీ కూడా ఎఫెక్టివ్‌ అనిపించకపోవడంతో 'త్రిపుర' బోరింగ్‌ థ్రిల్లర్‌గా మారింది. పైన చెప్పిన అంశాలే 'గీతాంజలి' విజయానికి కారణం కాగా మళ్లీ ఆ విధమైన వినోదాన్ని అందించడంలో రాజ కిరణ్‌ ఫెయిలయ్యాడు. ఆ చిత్రాన్ని ఎంజాయ్‌ చేసిన ప్రేక్షకులు కూడా త్రిపురతో నిరాశ పడే అవకాశాలే ఎక్కువట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com