
మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఆగష్టు 21న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే నేడు 'టాక్సిక్' అనే భారీ పాన్ ఇండియా మూవీ థియేటర్లలోకి రావడం, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్క్రీన్స్ దానికి కేటాయించడంతో.. 'ఇరుముడి' కలెక్షన్స్ కి భారీ గండి పడుతుందని భావించారంతా. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
అడ్వాన్స్ బుకింగ్స్ తో సంచలనం సృష్టించి, భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన 'టాక్సిక్' మూవీ.. మొదటి షోకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. భారీతనం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, సినిమాలో విషయం లేదని నెటిజెన్లు విమర్శిస్తున్నారు. కథాకథనాలపై దృష్టి పెట్టకుండా.. అవసరంలేని యాక్షన్, బోల్డ్ సీన్స్ తో సినిమాను నింపేశారని ట్రోల్ చేస్తున్నారు.
'టాక్సిక్' సినిమాకి మొదటి షోకే ఇంతటి దారుణమైన టాక్ రావడం.. 'ఇరుముడి'కి ఖచ్చితంగా కలిసొస్తుంది అనడంలో డౌట్ లేదు. 'టాక్సిక్'కి ఎలాగూ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నెగటివ్ టాక్ కారణంగా.. యూత్ కూడా వెనకడుగు వేసే అవకాశముంది. దాంతో 'ఇరుముడి' ప్రభంజనం కొనసాగనుంది. ఇప్పటికే వీక్ డేస్ అయిన సోమవారం, మంగళవారం నాడు బుకింగ్స్ చూసి ట్రేడ్ కూడా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు 'టాక్సిక్' టాక్ తో.. 'ఇరుముడి' థియేటర్ల వైపు మరింతగా క్యూ పెరిగితే.. ఆటోమేటిక్ గా థియేటర్ల కౌంట్ కూడా పెరుగుతుంది. అదే జరిగితే త్వరలోనే 'ఇరుముడి' రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Toxic Review, Yash, Geetu Mohandas






