
2027 వేసవిలో రెండు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమా మార్చి 5న రిలీజ్ కానుండగా, మహేష్ బాబు - రాజమౌళి కాంబో మూవీ ఏప్రిల్ 7న వస్తోంది. నెల రోజుల గ్యాప్ లో రెండు భారీ సినిమాలు వస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై సందీప్ రెడ్డి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.
'రోమాంచకం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో 'వారణాసి - స్పిరిట్' సినిమాల పోటీకి సంబంధించిన ప్రశ్న సందీప్ రెడ్డికి ఎదురైంది. "మార్చి 5న స్పిరిట్ వస్తోంది. అలాగే ఏప్రిల్‌లో వారణాసి వస్తోంది. రెండు కూడా వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ పాకెట్ ఉన్న సినిమాలు. ఈ నెల రోజుల గ్యాప్ బాక్సాఫీస్‌కు సరిపోతుందా?" అని రిపోర్టర్ అడగ్గా, వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
"వారణాసి సినిమా మా స్పిరిట్ కంటే పెద్దదండి" అని చెప్పిన సందీప్ రెడ్డి.. "రెండు సినిమాల మధ్య ఉన్న 30-32 రోజుల గ్యాప్ థియేట్రికల్ రన్‌కి, బిజినెస్ పాకెట్‌కి సరిపోతుంది" అని అన్నారు. అక్కడితో ఆగకుండా.. "మేం జరుగుతాం అయితే. మీకు ఈ ఆన్సర్ వినాలని ఉందిగా" అంటూ నవ్వుతూ చెప్పారు.
సందీప్ రెడ్డి ఎక్కువగా సీరియస్ గా ఉంటారనే పేరుంది. కానీ, ఈ ఈవెంట్ లో మాత్రం ఆయన ఎంతో సరదాగా కనిపించారు. ఒక వైపు రెండు సినిమాలకు మధ్య 30 రోజుల గ్యాప్ సరిపోతుంది అని చెబుతూనే, మరోవైపు మీకు కావాల్సిన ఆన్సర్ అంటూ 'మేము జరుగుతాం' అని చెప్పడం నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sandeep Reddy Vanga, Spirit, Varanasi, Romanchakam






