Home

»

Latest News

హైదరాబాద్‌లో 'టాక్సిక్' రచ్చ.. 50,000 మందితో భారీ ఈవెంట్.!

Aug 19, 2026 4:44PM

కేజీఎఫ్ సిరీస్ భారీ విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'టాక్సిక్'. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 26న విడుదల కానుంది.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసిన మేకర్స్.. ఆగష్టు 22న హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి యూనివర్సిటీలో సాయంత్రం 5 గంటల నుంచి వైభవంగా 'టాక్సిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. సుమారు 50,000 మంది అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.

'టాక్సిక్'పై భారీ హైప్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగునాట ఏకంగా రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అందుకే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తునారు. 

ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. "పెద్దల కోసం రూపొందించిన ఒక గ్యాంగ్‌స్టర్ ఫెయిరీ టేల్". ఈ సినిమాలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత వంటి ప్రముఖ హీరోయిన్స్ నటిస్తున్నారు.

ఆగష్టు 26న ప్రపంచవ్యాప్తంగా వేల కొద్దీ థియేటర్లలో 'టాక్సిక్' గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో సంచలనం సృష్టించిన యశ్.. మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రళయం సృష్టిస్తాడనేది చూడాలి.

 

 

 

Rocking Star Yash, Toxic Movie, Pre Release Event, Hyderabad

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com