Home

»

Latest News

టాక్సిక్ వివాదంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది!

Aug 19, 2026 4:25PM

 

యష్ వన్ మాన్ షో 'టాక్సిక్' వరల్డ్ సెల్యులాయిడ్ పై సందడి చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రిలీజ్ డేట్ 26 అయినా ముందు రోజు నుంచే ప్రీమియర్స్ ప్రదర్శిస్తారనే టాక్ వినిపిస్తుంది. దీంతో బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎదురుచూస్తూ ఉన్నారు. 

 'టాక్సిక్' చిత్రానికి ఆంధ్రప్రదేశ్ లో  ఉదయం 6 గంటల ప్రత్యేక షోకి 500 రూపాయలు, రెగ్యులర్ షో కి మల్టీప్లెక్స్‌లలో 100 వరకు, సింగిల్ స్క్రీన్‌లలో 75 వరకు టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే కన్నడ సీమలో మన తెలుగు సినిమాలకు, నటులకు నిరంతరం అడ్డంకులు ఎదురవుతున్న సమయంలో, పరభాషా చిత్రానికి రేట్స్ పెంచవద్దని పలువురు తెలుగు సినీ ప్రేమికులు  కోరుతున్నారు.    

Also read: ఆ స్టార్ హీరోకి అల్లుడిగా రామ్ పోతినేని!


సెన్సార్ బోర్డు నుంచి హింస, మితిమీరిన శృంగారం వల్ల  'A' సర్టిఫికేట్ పొందిన విషయం కూడా గుర్తు చేస్తున్నారు . గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన  'టాక్సిక్' దాదాపు 700 కోట్ల బడ్జెట్ తోకేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. హీరోయిన్స్ తో పాటు మిగతా నటీనటులందరూ ట్రైలర్ రిలీజ్ తర్వాత  అభిమానులు, ప్రేక్షకుల మనసులో మెదులుతూనే ఉన్నారు. 

Pawan kalyan, Yash, Toxic

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com