
ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకొని ఉంటే గాని హీరోగా ఫుల్ పాపులారిటీ సంపాదించడనే నానుడి సినీ ప్రేమికుల్లో ఉంది. అందుకు రాకింగ్ స్టార్ యష్ ఒక ఉదాహరణ. ప్రెజెంట్ టాక్సిక్ తో హల్ చల్ చేస్తున్నాడు. కానీ నెగిటివ్ టాక్ రావడంతో చాలా థియేటర్స్ ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి.
ఆ ఇందులో ఏముంది, హిట్టు, ప్లాపు కామన్ అని అనుకోవచ్చు. కానీ ఒక వర్గం ప్రజలు, ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ సోషల్ మీడియా వేదికగా యష్ పై విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతు సినిమా అనేది అందరు కలిసి చూసేలా ఉంటేనే విజయం సాధించడంతో పాటు నిర్మాతలకి కనకవర్షాన్ని కురిపిస్తుంది. కానీ టాక్సిక్ ఒక తండ్రి, కూతురు, అన్నా చెల్లెల్లు కలిసి చూడలేని విధంగా అర్ధం పర్థం లేని హై లెవెల్ రొమాన్స్ సీన్స్ తో నింపేశారు. పవిత్రమైన ప్రేమని నింపుకునే ప్రేమికులు కూడా ఆ సన్నివేశాలని చూడలేరు. శృంగారం అనేది పవిత్రమైన భావనతో కూడిన కడలి లాంటిదనే విషయాన్నీ మర్చిపోవడం దౌర్బాగ్యం. సెన్సార్ వాళ్ళు' A ' సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా అసలు ఇలాంటి సినిమాలు ముందు ముందు రాకుండా చూడాలని వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
Also Read: కలెక్షన్స్ సునామీ: 17 రోజులకి ఎంతంటే!
సినిమాని సినిమాగానే చూడాలని టాక్సిక్ ని సమర్ధించే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రస్తుతం టాక్సిక్ వరల్డ్ వైడ్ గా 285 కోట్ల గ్రాస్ మార్క్ దగ్గర ఉందనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి
.
[Toxic, Yash, Kaira Adwani, Tara Sutariya, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]






