
సామజవరగమన, సింగిల్ వంటి ఎంటర్‌టైనర్స్ తో యూత్ కి చేరువైన శ్రీ విష్ణు.. విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం 'కామ్రేడ్ కళ్యాణ్'తో పాటు, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఒక చేస్తున్నారు.
సితార బ్యానర్ లో ప్రొడక్షన్ నం.39 గా ఇది తెరకెక్కుతోంది. నేటి యువత జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, ఆశలు, ఆకాంక్షలు, సవాళ్లను ప్రతిబింబించే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఓ సరికొత్త ప్రయాణాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది.
ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. యువత జీవితానికి దగ్గరగా ఉండే అంశాలతో రూపొందుతున్న ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో పాటు, కథ ఎలా ఉండబోతుందనే విషయంపై మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. సహజమైన భావోద్వేగాలతో కూడిన ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భాన్ని గుర్తు చేసేలా ఉండబోతోంది.
"చిన్నప్పుడు స్కూల్లో మనం చాలా కలలు కంటాం.. అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అని. ఆ తర్వాత మన నాన్న స్థోమత మేరకు ఒక మామూలు కాలేజ్ లో చదువుకుంటాం. పెద్దయ్యాక కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం చేయడం మొదలుపెడతాం. నచ్చినా నచ్చకపోయినా చేస్తూనే ఉంటాం. కానీ, ఈ ప్రయాణంలో మనం ఏమవ్వాలనేది మర్చిపోతాం. ఇది మన అందరి కథ" అంటూ వాయిస్ ఓవర్ తో సాగిన గ్లింప్స్ ఆకట్టుకుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హారికా సూర్యదేవర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. నాగ వంశీ సమర్పిస్తున్నారు. సన్నీ సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
యువతకు కనెక్ట్ అయ్యే కథాంశం, సహజమైన భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన కథనంతో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నం.39 ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకునేలా “ఇది మన అందరి కథ” అనే భావనను అందించనుంది.
[Sree Vishnu, Sithara Entertainments, Production No 39 Glimpse, Naga Vamsi, Telugu Film News, Telugu News]






