డైరెక్టర్స్ తో రిపీట్ మోడ్ లో టాప్ స్టార్స్!
on Jun 30, 2022
టాలీవుడ్ లో ప్రస్తుతం పలువురు అగ్ర కథానాయకులు తమకు కలిసొచ్చిన దర్శకులతో మరో ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్టర్స్ తో రిపీట్ మోడ్ లో ఉన్న ఆ టాప్ స్టార్స్ ఎవరంటే..
పవన్ కళ్యాణ్ః
సరిగ్గా పదేళ్ళ క్రితం `గబ్బర్ సింగ్` (2012) అంటూ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. కట్ చేస్తే.. ఇప్పుడు `భవదీయుడు భగత్ సింగ్` కోసం మరోమారు జట్టుకడుతున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది.
మహేశ్ బాబుః
మహేశ్ బాబు కెరీర్ లో `అతడు` (2005), `ఖలేజా` (2010) చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ సినిమాలను రూపొందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేయబోతున్నారు మహేశ్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వచ్చే ఏడాది తెరపైకి రానుంది.
జూనియర్ ఎన్టీఆర్ః
ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో `జనతా గ్యారేజ్` (2016) ఒకటి. ఆ సినిమాని జనరంజకంగా తీర్చిదిద్దిన కొరటాల శివ నిర్దేశకత్వంలో మరో మూవీ చేయబోతున్నారు తారక్. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. అతి త్వరలో చిత్రీకరణకి వెళ్ళనుంది.
అల్లు అర్జున్ః
`ఆర్య`, `ఆర్య 2`, `పుష్ప - ద రైజ్`తో సుకుమార్ డైరెక్షన్ లో హ్యాట్రిక్ కొట్టారు అల్లు అర్జున్. త్వరలో `పుష్ప` రెండో భాగం `పుష్ప - ద రూల్` కోసం ఇంకోసారి టీమ్ అప్ కానున్నారు. వచ్చే సంవత్సరం ఈ క్రేజీ ప్రాజెక్ట్ సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
Also Read