రజనీకాంత్ ను చూడగానే అంకుల్ అంటూ ఏడ్చేసిన 'మీనా'
on Jun 30, 2022
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలిసి ఎందరో సినీ ప్రముఖులు మీనా ఇంటికెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన సూపర్ స్టార్ రజినీకాంత్ ను చూడగానే అంకుల్ అంటూ మీనా బోరున ఏడ్చేసింది.
సినీపరిశ్రమలో రజినీకాంత్ తో మీనాకు మంచి అనుబంధం ఉంది. రజినీకాంత్ హీరోగా నటించిన సినిమాల్లో బాల నటిగా నటించిన ఆమె.. ఆ తర్వాత ఆయన సరసన పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. బాల నటిగా చేస్తున్న సమయం నుంచి ఆమెకు రజినీని అంకుల్ అని పిలిచే అలవాటు ఉందట. ఈ క్రమంలో తన భర్త భౌతిక కాయానికి నివాళులర్పించడానికి వచ్చిన రజినీని చూడగానే ఆమె అంకుల్ అంటూ గట్టిగా ఏడ్చేసింది. దీంతో ఆమెను ఓదారుస్తూ రజినీ కూడా కంటతడి పెట్టాడు.
కాగా బెంగళూరుకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను 2009 లో మీనా వివాహం చేసుకుంది. వీరికి 11 ఏళ్ళ నైనికా అనే పాప ఉంది. ఈ పాప విజయ్ మూవీ 'తేరి'లో బాలనటిగా ఆకట్టుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
