
1. 'జెట్లీ' మూవీ రివ్యూ
సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబినేషన్‌లో వచ్చిన 'జెట్లీ' (Jetlee) మూవీ డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. సత్య తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చేయగా.. సినిమాలో బలమైన కథ లేకపోవడం, సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సన్నివేశాలు మైనస్ గా మారాయి. సత్య కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు.
2. 'గాయపడ్డ సింహం' మూవీ రివ్యూ
తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషించిన 'గాయపడ్డ సింహం' కూడా డివైడ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. అమెరికా నుండి డిపోర్ట్ అయిన యువకుడు.. డోనాల్డ్ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం అనే సిల్లీ పాయింట్‌తో సాగుతుంది. దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ ఎంచుకున్న కథాంశం సిలీగా ఉండటమే కాకుండా.. సినిమా అంతా పాతకాలపు కామెడీతో బోర్ కొట్టిస్తుంది. అక్కడక్కడా మాత్రమే నవ్విస్తుంది.
3. బాలయ్య-కొరటాల మూవీ ప్రకటన
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK112'ను అధికారికంగా ప్రకటించారు. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కొరటాల శివ తనదైన శైలిలో సామాజిక సందేశంతో కూడిన ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను బాలయ్య కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
4. మారిన పెద్ది రిలీజ్ డేట్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాను వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. మొదట జూన్ 25న విడుదల చేయాలనుకున్నా.. 'టాక్సిక్' వాయిదాతో జూన్ 4 స్లాట్ ఖాళీ అవ్వడంతో ఈ డేట్ పై కర్చీఫ్ వేసింది 'పెద్ది' టీమ్.
5. 'డ్రాగన్'పై 'వార్ 2' ఎఫెక్ట్
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ ఆలస్యంపై మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధి శశి స్పందించారు. ఎన్టీఆర్ గత చిత్రం 'వార్ 2' ఫలితాన్ని విశ్లేషించుకున్న తర్వాత.. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌లోని కీలక అంశాలను మరింత మెరుగుపరిచేందుకు కొంత సమయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని, ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని శశి వెల్లడించారు.
6. నారా ఇంట పండుగ వాతావరణం
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో తండ్రి కాబోతున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రోహిత్ భార్య శిరీష లెళ్ళ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
7. అషురెడ్డి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డికి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార కథనాలను ప్రసారం చేయకూడదని మీడియా, సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై స్పందించిన అషురెడ్డి.. తన ప్రైవసీని గౌరవించాలని, అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
8. మల్లారెడ్డి బయోపిక్
తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో తన జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. ఒకవేళ తన బయోపిక్ తీస్తే దానికి తానే నిర్మాతగా వ్యవహరిస్తానని, అలాగే ఆ సినిమాలో ఒక పాత్రలో కూడా నటిస్తానని ఆయన పేర్కొన్నారు. గతంలో విలన్ పాత్రలు ఆఫర్ వచ్చినప్పటికీ, తన గౌరవానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో వాటిని తిరస్కరించినట్లు ఆయన తెలిపారు.
9. టాలీవుడ్ మేకర్స్ పై రవిబాబు ఫైర్
టాలీవుడ్ సినిమా నిర్మాణ శైలిపై నటుడు, దర్శకుడు రవిబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "అప్పుడు సినిమాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాళ్ళు.. ఇప్పుడు కొందరు ఒళ్ళు బలిసి చేస్తున్నారు." అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలు అనవసరంగా ఆలస్యం అవుతున్నాయని.. రచయితలు, దర్శకులు హీరోల ఇమేజ్ కోసం రాజీ పడటం వల్ల నాణ్యత దెబ్బతింటుందని ఆయన విమర్శించారు. సినీ పరిశ్రమలో మారుతున్న ఈ పోకడలు ఆరోగ్యకరమైనవి కావని.. నిర్మాతల సమయం, డబ్బు వృథా కాకుండా ఉండాలంటే మార్పు అవసరమని రవిబాబు పేర్కొన్నారు.
10. సూపర్‌హీరో సినిమాలో సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పాపులర్ డైరెక్టర్ల ద్వయం రాజ్-డీకే కాంబినేషన్‌లో ఒక భారీ సూపర్‌హీరో మూవీ పట్టాలెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2026 అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక పూర్తిస్థాయి సూపర్‌హీరో పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.





.webp)
