Home

»

Latest News

Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్..

Apr 29, 2026

1. కొత్త మార్కెట్ పై వారణాసి గురి
మహేష్ బాబు-రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' అంతర్జాతీయ స్థాయిలో కొత్త మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పటికే నార్త్ అమెరికా, జపాన్ వంటి దేశాల్లో సత్తా చాటిన రాజమౌళి.. ఈ సినిమాతో సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా దేశాలపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.

2. మెగాస్టార్ కు అరుదైన గౌరవం
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'దొంగ' సినిమాలోని ఐకానిక్ 'గోలీమార్' సాంగ్ లుక్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ గెటప్‌ను ప్రతిబింబించేలా అమెరికాలోని ఒక ప్రముఖ కంపెనీ 'యాక్షన్ ఫిగర్‌'ను మార్కెట్లోకి విడుదల చేసింది. హాలీవుడ్ సూపర్ హీరోల తరహాలో ఒక భారతీయ నటుడికి ఇలాంటి గుర్తింపు రావడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ఫిగర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3. చెప్పిన డేట్ కే 'లెనిన్' 
అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీ వాయిదా వార్తలకు నాగార్జున చెక్ పెట్టారు. ఈ సినిమా జూన్ 26న విడుదల కానుందని స్పష్టం చేశారు. 'లెనిన్' ఫస్ట్ కట్ చూసిన నాగార్జున.. వెండితెరపై ప్రేక్షకులు సరికొత్త అఖిల్‌ను చూడబోతున్నారని నమ్మకం వ్యక్తం చేశారు. కంటెంట్ పై నమ్మకం ఉందని, జూన్ 26న థియేటర్లలో కలుద్దామని నాగ్ ట్వీట్ చేశారు.

4. 80 అడుగుల ఎత్తు నుంచి రష్మిక జంప్
రష్మిక మందన్న తన తాజా చిత్రం 'మైసా' కోసం డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి రిస్కీ యాక్షన్ స్టంట్ చేసింది. సీన్ సహజంగా రావాలనే ఉద్దేశంతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం చూసి.. మూవీ టీంతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ స్టంట్ సమయంలో ఆమెకు చిన్న గాయాలైనా లెక్కచేయకుండా షూటింగ్‌ను కొనసాగించడం ఆమె అంకితభావానికి నిదర్శనమని దర్శకుడు రవీంద్ర పుల్లె కొనియాడారు.

5. దర్శకుడు కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. జర్నలిస్టు, దర్శకుడు రఘురామ్ మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తూ గుండెపోటుతో కన్నుమూశారు. జగిత్యాలకు చెందిన ఆయన జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. అలాగే, 2004 లో వచ్చిన 'వరం' సినిమాతో దర్శకుడిగా మారారు. పలు సినిమాలకు రైటర్ గానూ పనిచేశారు. 

6. మళ్ళీ వాయిదా పడిన 'టాక్సిక్'
రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి సినిమా 'టాక్సిక్' వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్‌తో విడుదల చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని, అందుకే మరింత సమయం తీసుకుంటున్నామని యశ్ పేర్కొన్నారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.

7. టైగర్ తో బాలీవుడ్ ఎంట్రీ
ప్రముఖ నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'.. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌ నటించబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

8. ఆ యాక్టర్ తో పూజా హెగ్డే డేటింగ్ 
ప్రముఖ నటి పూజా హెగ్డే డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె బాలీవుడ్ యాక్టర్ రోహన్ మెహ్రాతో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి పలు ప్రైవేట్ పార్టీల్లో కనిపిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ విషయంపై పూజా హెగ్డే కానీ, ఆమె సన్నిహితులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు.

9. నిత్యా మీనన్ బోల్డ్ స్టేట్‌మెంట్
పెళ్లి, మాతృత్వంపై నటి నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం వయసు అయిపోతుందనే కారణంతో పెళ్లి, పిల్లలు వద్దని స్పష్టం చేశారు. తల్లి కావాలనేది ఒక మహిళ వ్యక్తిగత నిర్ణయమని.. పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనే మార్గాలు ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో తనకు పెళ్లి కాకపోయినా.. పిల్లల కోసం దత్తత తీసుకునే ఆలోచన ఉందని నిత్య తెలిపారు.

10. శివాజీకి గాయత్రీ గుప్తా కౌంటర్
మహిళల డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసిన శివాజీకి తాజాగా నటి గాయత్రీ గుప్తా గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వాళ్ళు వేసుకునే బట్టలతో నిర్ణయించలేం" అని ఆమె కుండబద్దలు కొట్టారు. తనను జడ్జ్ చేసే అధికారం ఎవరికీ లేదని, ఏ బట్టలు వేసుకోవాలో అనేది మహిళల వ్యక్తిగత ఇష్టమని ఆమె స్పష్టం చేశారు. గాయత్రీ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com