Home

»

Latest News

రిలీజ్ ప్లానింగ్ లోపమా: ఓటీటీ రూల్స్ తెచ్చిన చిక్కులా!

Oct 8, 2026 2:32PM


ఇప్పుడు తెలుగు సినిమా' ఎందుకో ఏమో,తుళ్ళి తిరిగెను మనసే. పిచ్చి పరుగులు తీసే వెళ్లి వెరిసేను వయసే' అని పాడుకునే పరిస్థితి. ఇందుకు కారణం తెలుగు సినిమాని దశాబ్దాల కాలం నుంచి ఏలుతున్న అగ్ర హీరోలు. మరి పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.


టాలీవుడ్ నాలుగు స్తంభాలుగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, గాడ్ ఆఫ్ మాసెస్  బాలకృష్ణ, కింగ్  నాగార్జునలు తమ వరుస భారీ ప్రాజెక్టులతో ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే, రాబోయే పండుగ సీజన్ల విడుదల తేదీల విషయంలో మాత్రం నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లలో తీవ్రమైన కలవరం మొదలైంది. పక్కా ప్రణాళిక లోపం, ఓటీటీ నిబంధనలు, మరియు సరైన థియేటర్ల సర్దుబాటు లేకపోవడం వల్ల సీనియర్ హీరోల చిత్రాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.   

ముఖ్యంగా చిరు, వెంకీ చిత్రాల విడుదలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి భారీ మాస్ ఎంటర్టైనర్ 'కాకా' వేగంగా షూటింగ్ జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు విక్టరీ వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం (AK 47)' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతకుముందు చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఏకంగా 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా, దర్శకుడు బాబీతో తీసిన 'వాల్తేరు వీరయ్య' గతంలోనే 200 కోట్ల మార్కును దాటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అదే క్రమంలో విక్టరీ వెంకటేష్ కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో 300 కోట్ల భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులను సృష్టించారు. ఈ ఇద్దరు బాక్సాఫీస్ విజేతలు ఒకే పండుగ లేదా ఒకే సీజన్ బరిలో పడితే వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందనే ధర్మసందేహం నిర్మాతల మధ్య నెలకొంది.   ఈ పోరు కేవలం వీరిద్దరికే పరిమితం కాలేదు. అక్కినేని నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ మైలురాయి చిత్రం 'కింగ్ 100' తో క్రిస్మస్ రేసులోకి దిగుతుండగా, అదే రోజున గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'దాదా' చిత్రం విడుదల కాబోతోంది. నాగార్జున ఇప్పటివరకు 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టని నేపథ్యంలో, ఈ మైలురాయి చిత్రంతో 100 కోట్ల గ్రాస్ అందుకోవాలని చూస్తుంటే, బాలకృష్ణ తన కెరీర్‌లోనే మొదటిసారి 200 కోట్ల క్లబ్‌లో చేరాలని పక్కా మాస్ వ్యూహంతో వస్తున్నారు.


ఇది కూడా చదవండి: కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

 

 ఒకే రోజు లేదా ఒకే వారంలో రెండు పెద్ద సినిమాలు తలాపడితే థియేటర్ల కేటాయింపు, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లభ్యత కష్టంగా మారుతుంది.  ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లు విధించిన 4 వారాల నుండి 8 వారాల నిబంధనల వల్ల కూడా మేకర్స్ రిలీజ్ డేట్స్ మార్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా విడుదల తేదీ నిర్ణయించడంలో ముందస్తు ప్లానింగ్ లోపించడం వల్ల రెండు అతిపెద్ద సినిమాల మధ్య రూ. 200 కోట్ల నుండి రూ. 300 కోట్ల మేర బాక్సాఫీస్ వ్యాపారం పణంగా పెట్టాల్సి వస్తోంది. ఈ రిలీజ్ క్లాష్‌లు అభిమానుల ఉత్సాహాన్ని పెంచినప్పటికీ, ట్రేడ్ వర్గాలకు మాత్రం పెను సవాలుగా పరిణమించాయి. మరి ఈ బాక్సాఫీస్ గందరగోళం నుంచి తప్పించుకుని ఏ హీరో బాక్సాఫీస్ రారాజుగా నిలుస్తాడో వేచి చూడాలి.  

  

 [Tollywood Senior Heroes Box Office Clash, Tollywood Senior Heroes, Chiranjeevi vs Venkatesh, Tollywood Box Office Clash 2026, Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com