
ఏ సినిమా బిగ్ స్క్రీన్‌పైకి రావాలన్నా ముందుగా సెన్సార్ ప్రక్రియ పూర్తి కావాల్సిందే. సినిమాను పరిశీలించిన తర్వాత దానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి? అనే నిర్ణయం తీసుకునేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC). అయితే సినిమాల్లో కొన్ని సీన్లు, డైలాగ్స్ విషయంలో సెన్సార్ నుంచి వచ్చే సూచనలు మాత్రం తరచూ చర్చకు వస్తుంటాయి.
తాజాగా ఈ అంశంపై ప్రముఖ నిర్మాత, రచయిత కోనా వెంకట్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
శ్రీ విష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కోనా వెంకట్.. సెన్సార్ వ్యవస్థపై తన అభిప్రాయాన్ని కాస్త ఘాటుగానే చెప్పారు. సెన్సార్ వాళ్లకు సినిమా విషయంలో సర్టిఫికెట్ ఇచ్చే అధికారం మాత్రమే ఉంటుందని.. సినిమాలో మార్పులు, చేర్పులు చేయాలని చెప్పే అధికారం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాకు సర్టిఫికెట్ విషయంలో తాను ఢిల్లీ వరకు వెళ్లి మరీ పోరాడాల్సి వచ్చిందని కోనా వెంకట్ తెలిపారు. చివరకు తన సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ తీసుకొచ్చినట్లు చెప్పారు. సెన్సార్ సమస్యలపై మరో సమయంలో తప్పకుండా ఓ మీటింగ్ పెడతానని, ఈ అంశంపై ఇప్పటికే సినీ పెద్దలతో కూడా మాట్లాడానని ఆయన పేర్కొన్నారు.
అయితే సెన్సార్ విషయంలో కోనా వెంకట్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అసలు సినిమాపై సెన్సార్ బోర్డు పాత్ర ఎంతవరకు ఉండాలి? సర్టిఫికెట్ ఇవ్వడానికే పరిమితం కావాలా? లేక కంటెంట్ స్వభావాన్ని బట్టి కొన్ని మార్పులు సూచించే అధికారం ఉండాలా? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
ఇది కూడా చదవండి: నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్ అప్డేట్.!
[Kona Venkat Comments On Censor Board, Kona Venkat, Comrade Kalyan, Sree Vishnu, Mahima Nambiar, Janakiram Marella, Telugu Comedy, Telugu Film News]






