Home

»

Latest News

దిల్‌రాజుకు ప్రమోషన్..!

Nov 4, 2016 12:57PM

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుకు ప్రమోషన్ వచ్చింది. రాజుగారికి ప్రమోషన్‌ ఏంటా అని ఆశ్చర్యపోకండి..ఇప్పటివరకు నిజజీవితంలో కొడుగ్గా, భర్తగా, తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించిన దిల్‌రాజు తాత అయ్యాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం..ఆయన కుమార్తె హన్సిత రెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చారు. ప్రముఖ విద్యాసంస్థల అధినేత నర్సింహారెడ్డి కుమారుడు అర్చిత్ రెడ్డితో హన్సిత రెడ్డి వివాహం మే 2, 2014న ఊటీలో అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తన కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న దిల్‌రాజుకు ఈ విషయం తెలియడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వెంటనే యూనిట్ సభ్యులందరికీ స్వీట్లు పంచి సంబరాలు చేశారట. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు దిల్‌రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com