Home

»

Latest News

బాక్సాఫీస్ వద్ద జూన్ హీట్:  'పెద్ది' త‌ర్వాత థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ మూవీస్ ఇవే!

Jun 4, 2026 7:42PM

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వేసవి కాలం ముగింపు దశకు వస్తున్నా, సినిమాల సందడి మాత్రం తగ్గడం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నయా సెన్సేషన్ పెద్దిచిత్రంతో టాలీవుడ్ సమ్మర్ విన్నర్‌గా నిలిచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా అందించిన భారీ ఉత్సాహంతో, ఇదే జూన్ నెలలో మరికొన్ని విభిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి క్యూ కడుతున్నాయి. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ ఆసక్తికర చిత్రాల వివరాల్లోకి వెళితే..

ముందుగా జూన్ 11వ తేదీన 'సింగ్ గీతం' అనే వెరైటీ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, టాలెంటెడ్ మేకర్ నాగ్ అశ్విన్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ మ్యూజికల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కింది. ప్రస్తుతం 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం గారు ఈ రేంజ్ క్రియేటివిటీతో సరికొత్త కథను తీసుకురావడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఆయన అందించిన 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' లాంటి క్లాసిక్స్ తరహాలోనే, ఈ సినిమా కూడా ఇప్పటివరకు తెలుగు స్క్రీన్‌పై చూడని సరికొత్త కాన్సెప్ట్‌తో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

దీని తర్వాత, జూన్ 19న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం రిలీజ్ కానుంది. ఫీల్ గుడ్ సినిమాల దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు పాపులర్ మేకర్ రాజ్ నిడిమోరు కథ, నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వంటి వెబ్ సిరీస్‌ల తర్వాత సమంత, రాజ్ కలయికలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సమంత, నందిని రెడ్డి ఇద్దరికీ ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది.

ఇక జూన్ చివరి వారంలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్'తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు. గత చిత్రం 'ఏజెంట్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈసారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో అఖిల్ ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రచార చిత్రాలు, కంటెంట్ ప్రేక్షకులలో మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాతో అఖిల్ కెరీర్ సరికొత్త మలుపు తిరుగుతుందని అక్కినేని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

సోషల్ మీడియాలో కూడా ఈ జూన్ రిలీజ్‌లపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అటు సమంత లేడీ ఓరియెంటెడ్ పవర్, ఇటు అఖిల్ మాస్ కంబ్యాక్, మరోవైపు సింగీతం గారి వింటేజ్ మ్యాజిక్.. ఇలా మూడు భిన్నమైన జోనర్ల చిత్రాలు పోటీ పడుతుండటం విశేషం. ఈ క్రేజీ లైనప్‌తో జూన్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ ముగ్గురిలో బాక్సాఫీస్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com