Home

»

Latest News

మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్: టాలీవుడ్ విలన్ ఇంట పండగ వాతావరణం.!

Sep 29, 2026 3:54PM

టాలీవుడ్ ప్రముఖ నటుడు, విలన్ 'టార్జాన్' లక్ష్మీనారాయణ ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఆయన ఇంట్లోకి మహాలక్ష్మి లాంటి మనవరాలు అడుగుపెట్టింది. ఆ చిన్నారి రాకను ఆయన సెలెబ్రేట్ చేసుకున్న తీరు చూస్తే ఎవరికైనా ముచ్చటేయాల్సిందే.

హాస్పిటల్ నుంచి పాపను ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఇల్లంతా కలర్‌ఫుల్ బెలూన్లు, పూల డెకరేషన్‌తో నింపేశారు. పూల వాన కురిపిస్తూ, బాణసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. ఆ చిన్నారికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలు చూస్తుంటే.. "తాత మనసులో మనవరాలికి ఎంతటి ప్రాధాన్యత ఉందో" ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది.

ఈ వేడుకకు సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. నెటిజన్లు, టాలీవుడ్ అభిమానులు ఈ వీడియో చూసి మైమరిచిపోతున్నారు.

లక్ష్మీనారాయణ గారు పాపను ఎంతో ఆప్యాయంగా ఎత్తుకుని మురిసిపోతుంటే.. ఆయన కళ్లల్లో కనిపించిన ఆనందం, ఆ తృప్తి వెలకట్టలేనివి. ఒక నటుడిగా ఎన్నో పాత్రలు వేసినా.. "తాత" అనే ఈ కొత్త పాత్రాయనకు అత్యంత ప్రియమైనదిగా మారిపోయిందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అప్పుడు దేవర.. ఇప్పుడు ప్యారడైజ్..

 

 

 

[Tarzan Grand Child Welcome Video, Villain Tarzan Laxminarayana, Tarzan Instagram, Tarzan Laxminarayan, Telugu Viral Video, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com