Home

»

Latest News

మేడారం సమ్మక్క,సారలమ్మ దగ్గర నాని: సమర్పించిన మొక్కు వివరాలు ఇవే!

Sep 29, 2026 4:04PM


'ది ప్యారడైజ్' ప్రస్తుతం టాక్ కి విరుద్ధంగా 155 కోట్ల క్లబ్ లో చేరింది . ఈ గొప్ప సక్సెస్ ఇచ్చిన సంతోషంలో దేవుళ్లకు ఇచ్చిన మొక్కులు తీర్చుకునేందుకు 'ది ప్యారడైజ్' టీమ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా  తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన మేడారంలోని శ్రీ సమ్మక్క-సారలమ్మ వనదేవతలని  దర్శించుకున్నారు. 


మేడారానికి బయలుదేరే మార్గంలో భాగంగా చిత్ర బృందం మొదట ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుంది. గట్టమ్మ ఆలయంలో  నాని, నటుడు సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అర్చకులు వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. నేచురల్ స్టార్ వస్తున్నాడనే వార్త తెలుసుకున్న అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి: పిచ్చోడి చేతిలో రాయి: అనుభవం లేని దర్శకుల చేతిలో భారీ ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయా!

 

గట్టమ్మ దర్శనం అనంతరం 'ది ప్యారడైజ్' బృందం నేరుగా వనదేవతల నిలయమైన మేడారం సమ్మక్క-సారలమ్మల ఆలయానికి చేరుకుంది. శ్రీకాంత్ ఓదెల, నానిల కలయికలో సినిమా ప్రారంభమైనప్పుడే మేడారం అమ్మవార్ల ఆశీస్సులు పొంది, చిత్రం ఘనవిజయం సాధిస్తే మొక్కులు చెల్లిస్తామని వేడుకున్నారు. అందులో భాగంగానే తమ మొక్కును తీర్చుకునేందుకు అమ్మవార్ల సన్నిధిలో తమ శరీర బరువుకు సమానమైన నిలువెత్తు 'బంగారాన్ని' (బెల్లం) తులభారంగా సమర్పించారు. మేడారంలో అమ్మవార్లకు బెల్లాన్ని బంగారం అని పిలవడం మరియు శరీరం బరువుతో తులభారం వేసి సమర్పించడం ఎంతో పవిత్రమైన సాంప్రదాయం. ఈ భక్తిపూర్వక మొక్కుతో నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ తమ నిష్టను చాటుకున్నారు. ప్యారడైజ్ లో నాని తల్లి క్యారక్టర్ పేరు సమ్మక్క . అసలు సినిమాపేరే సమ్మక్క అని పెడదామని అనుకున్నారు.


 

[Hero Nani At The Paradise, The Paradise Team At Medaram, Nani And Srikanth Odela In Sammakka And saralamma, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com