Home

»

Latest News

‘రంగం’ వెనుక కథ: ముగ్గురు స్టార్స్ వదులుకున్న బ్లాక్ బస్టర్.!

Sep 24, 2026 7:21PM

 

కె.వి. ఆనంద్ దర్శకత్వంలో జీవా, కార్తీక, అజ్మల్ అమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కో’ సినిమా 2011లో విడుదలై తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో ‘రంగం’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా సూపర్‌హిట్ అయింది. 

అయితే ఈ సినిమాలో జీవా నటించడం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ముందుగా ఈ కథను అజిత్ లేదా కార్తితో చేయాలని దర్శకుడు కె.వి. ఆనంద్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు.

ఆ తర్వాత శింబుకు కథ వినిపించగా.. ఆయన సినిమాకు ఓకే చెప్పారు. శింబుతో కొన్ని సన్నివేశాలను షూట్ కూడా చేశారు. అయితే శింబు అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది.

బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని అశ్విన్ కుమార్ పాత్ర కోసం జీవాను సంప్రదించారు. కథ విన్న జీవా మరో మాట లేకుండా సినిమాకు అంగీకరించారు. అలా శింబు చేయాల్సిన పాత్ర జీవా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత అదే పాత్ర జీవా కెరీర్‌లోనే గుర్తుండిపోయే క్యారెక్టర్‌గా మారింది.

ఇది కూడా చదవండి: గ్లోబల్ స్టార్ బాలయ్య.. ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో ట్రంప్‌ను ట్రోల్ చేసిన ఇరాన్.!

2011 ఏప్రిల్ 22న ‘కో’ విడుదలైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మూడు వారాల తర్వాత ఇదే సినిమా తెలుగులో ‘రంగం’ పేరుతో విడుదలైంది.

తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరించారు. ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు వంటి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటులు ఉండటం కూడా సినిమాకు ప్లస్ అయింది. ‘రంగం’ తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించింది. 

‘కో’ సినిమాకు పాటలు కూడా మరో పెద్ద బలంగా నిలిచాయి. హేరిస్ జయరాజ్ అందించిన సంగీతం అప్పటి యువతను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ‘ఎందుకో ఏమో’ పాట అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

అలా మొదట అజిత్ లేదా కార్తితో అనుకున్న సినిమా.. ఆ తర్వాత శింబు దగ్గరకు వెళ్లి.. చివరికి జీవా చేతికి వచ్చింది.

మీకు నచ్చవచ్చు:
55 ఏళ్ళ క్రితం కృష్ణ సాహసం.. సూపర్ స్టార్ బాటలో పయనించిన స్టార్స్ వీళ్ళే.!
రాయలసీమ రామన్న చౌదరి.. మోహన్ బాబు ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.!

 

 

 

[Ko Movie, Rangam Movie, Actor Jiiva, Ajmal Ameer, Karthika Nair, Simbu, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com