Home

»

Latest News

‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్: శ్రీను వైట్ల 'కంబ్యాక్'కు ఇది సరిపోతుందా.?

Sep 24, 2026 6:14PM

ఒకప్పుడు తన మార్క్ కామెడీతో టాలీవుడ్‌లో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు శ్రీను వైట్ల. అయితే కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు శర్వానంద్‌తో చేస్తున్న ‘జార్జ్ క్రిష్’ సినిమాతో మరోసారి తన సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారు.

శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి 'ఫస్ట్ బూస్టర్' రిలీజ్ చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే శర్వానంద్ ఇందులో జార్జ్, క్రిష్ అనే రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తున్నారు. ఒక పాత్ర క్రిస్టియన్‌గా, మరో పాత్ర కృష్ణుడి భక్తుడిగా కనిపించడం ఆసక్తిని పెంచుతోంది.

బూస్టర్‌లో శర్వా గెటప్స్, బాడీ లాంగ్వేజ్, కామెడీ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే శ్రీను వైట్ల తనకు బాగా కలిసొచ్చిన ఎంటర్‌టైన్మెంట్ జానర్‌లోనే మరోసారి సినిమా చేస్తున్నట్లు అనిపిస్తోంది. రెండు పాత్రల మధ్య ఉండే కాంట్రాస్ట్‌ను కామెడీకి ఎలా ఉపయోగించారన్నది కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా శర్వానంద్‌ను ఇంతకుముందు చూడని కొన్ని గెటప్స్‌లో చూపించడం సినిమాకు ప్లస్ అవుతోంది. కార్పొరేట్ లుక్‌తో పాటు జార్జ్, క్రిష్ పాత్రల్లో కనిపించిన వేరియేషన్స్ బూస్టర్‌కు మంచి కలర్ తీసుకొచ్చాయి. హీరోయిన్ మానస వారణాసి కూడా ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: వరుస ఫ్లాపులకు కారణం ఇదేనా.. ‘డ్రాగన్’పైనే ఇప్పుడు అందరి ఆశలు.!

‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్‌షా’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన కామెడీ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీను వైట్ల.. ఆ తర్వాత అదే స్థాయి విజయాలను అందుకోలేకపోయారు. దీంతో ‘జార్జ్ క్రిష్’ ఆయనకు చాలా కీలకమైన సినిమా అవుతోంది.

ఈ ఫస్ట్ బూస్టర్ చూస్తే మాత్రం పాత శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌ను మళ్లీ టచ్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. అయితే కేవలం బూస్టర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడం కష్టం. అసలు కథ, కామెడీ ట్రాక్, క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుతాయన్నది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది.

‘జార్జ్ క్రిష్’ను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాతో.. శ్రీను వైట్ల తన కంబ్యాక్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు.

మీకు నచ్చవచ్చు:
ప్యారడైజ్ చుట్టూ రాజకీయం.. ఒక్క పూటలోనే సీన్ రివర్స్.!
ప్యారడైజ్‌కు పోస్ట్ ప్రొడక్షన్ దెబ్బ.. సినిమాకు అది ఎంత కీలకమో గుర్తించరా.?

 

 

 

[George Krish First Booster, George Krish Movie, Sreenu Vaitla, Sharwanand, Manasa Varanasi, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com