Home

»

Latest News

ఈవారం కొత్త సినిమాల్లేవు.. అయినా ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటు లేదు!

Mar 10, 2026

గ·త నెలరోజులుగా టాలీవుడ్‌లో చిన్న సినిమాల సందడి కనిపిస్తోంది. చాలా చిన్న సినిమాలు, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. మరికొన్ని నిరాశపరిచాయి. ఇక పెద్ద సినిమాల గురించి చెప్పాలంటే.. అందరి దష్టీ ఇప్ప్పుడు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’పైనే ఉంది. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది. అలాగే బాలీవుడ్ మూవీ ‘దురంధర్‌2’ కూడా అదేరోజు గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. 

రెండు భారీ సినిమాలు రానున్న నేపథ్యంలో ఒక వారం ముందు నుంచే కొత్త సినిమాల రిలీజ్‌లను ఆపేశారు. ఈవారం కొత్త సినిమాల రిలీజ్‌లు దాదాపు లేనట్టే. ఓటీటీల్లో ఎప్పటిలాగే వివిధ భాషా చిత్రాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమయ్యాయి. వాటిలో 15 సినిమాలు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకునే సినిమాలు ఉండడం విశేషం. వాటిలో రవితేజ హీరోగా వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, విశ్వక్‌సేన్ ‘ఫంకీ’, ప్రియాంక మోహన్ ‘మేడిన్ కొరియా’ చిత్రాలు ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించే అవకాశం ఉంది. వీటితో పాటు జూటోపియా 2, ద తాజ్ స్టోరీ మూవీస్ కూడా స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యాయి. 

నెట్‌ఫ్లిక్స్
వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) మార్చి 10
మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ సినిమా)  మార్చి 12
వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) మార్చి 12
ఫంకీ (తెలుగు సినిమా) మార్చి 12

అమెజాన్ ప్రైమ్
ఆస్పిరెంట్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) మార్చి 13
లోకల్ టైమ్స్ (తమిళ సిరీస్) మార్చి 13

హాట్‌స్టార్
రిసార్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) మార్చి 13
ద సొసైటీ సీజన్ 2 (హిందీ రియాలిటీ సిరీస్) మార్చి 09
జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) మార్చి 13
ద ఫ్యామిలీ మెక్‌ములెన్ (ఇంగ్లీష్ మూవీ) మార్చి 15

జీ5
పూకీ (తమిళ సినిమా) మార్చి 13
భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు మూవీ) మార్చి 13
అంధ ప్యార్ 2.0 (రియాలిటీ షో) మార్చి 14

లయన్స్ గేట్ ప్లే
ద తాజ్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ సినిమా) మార్చి 13

ఎమ్ఎక్స్ ప్లేయర్
సంకల్ప్ (హిందీ సిరీస్) మార్చి 11

సన్ నెక్స్‌ట్
నాంగళ్ (తమిళ సినిమా) - మార్చి 13
ఫ్రైడే (తమిళ మూవీ) మార్చి 13

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com