
-యూట్యూబ్ చరిత్రలో రికార్డు
-అంతలా మెస్మరైజ్ చెయ్యడానికి రీజన్
-రికార్డు ఎంత!
ప్రేమికుల హృదయంలో ఉద్భవించే ప్రేమకి, పాటకి మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఆ రెండిటి మధ్య సదరు అనుబంధం ఎప్పుడు పుట్టిందో తెలియదు గాని, విడదీయరాని అనుబంధం అని చెప్పవచ్చు. ప్రేమికులు తమ ప్రియడు లేదా ప్రేయసిపై తమకున్న ప్రేమని చెప్పుకోవడానికి కూడా పాటే సాధనం. సాధనమే కాదు తమ లవ్ సక్సెస్ కి షార్ట్ కట్. ప్రేమ పాటకి ఉన్న సుదీర్ఘ ట్రాక్ రికార్డునే అందుకు ఉదాహరణ. ఎన్నో సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ప్రేమని తమ ముడి సరుకుగా భావించి కొన్ని వందల ప్రేమ పాటలకి జీవాన్ని ఇస్తున్నారు. అలాంటి ఒక ప్రేమ పాట యూట్యూబ్ చరిత్రలోనే రికార్డు వ్యూస్ ని కొల్లగొడుతుంది. మరి ఆ ప్రేమ పాట ఏంటో చూద్దాం.
'సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ'.. ఈ పదం చెప్పి చెప్పగానే మేము చాలా సార్లు విన్నాం. ప్రెజెంట్ కూడా వింటున్నామనే రాములమ్మ పాట ప్రేమికులకి లెక్కే లేదు. అంతలా సదరు సాంగ్ తో ట్రావెల్ అవుతూ వస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో 316 మిలియన్ లకి పైగా వ్యూస్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృషించింది. ఆ వ్యూస్ అంతటితో ఆగదని తెలుసు. మరో కొత్త రికార్డు కూడా రావడం ఖాయం. పైగా ఒక సినిమా పాటగా కాకుండా ప్రవైట్ ఆల్బమ్ గా రిలీజ్ అయ్యి రికార్డుల వేట కొనసాగిస్తుండటం మాములు విషయం కాదు. అన్నట్టు ఈ సాంగ్ ని సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మజాకా మూవీలో కూడా ఉపయోగించుకున్నారు. ఈ సాంగ్ కూడా 3 .8 మిలియన్స్ వ్యూస్ ని సాధించడం విశేషం.
aslo read: Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ పై ఆర్ నారాయణమూర్తి కామెంట్స్.. ఆ వ్యాఖ్యలు సరైనవేనా!
కల్లాకపటం లేని ఒక యువకుడు తన హృదయంలో తన ప్రియురాలుకి ఇచ్చిన స్థానమే రాములమ్మ సాంగ్ కాన్సెప్ట్. రచించింది, ఆలపించింది రాము రాథోడ్. సాంగ్ లో పెర్ ఫార్మ్ చేసింది కూడా తనే. దివ్య భగత్ సదరు రాములమ్మ గా చేయగా, కళ్యాణ్ కీస్ మ్యూజిక్ ని అందించడం జరిగింది.





