Home

»

Latest News

తీన్ మార్ చూసిన ఇంతియాజ్ ఆలీ

Apr 18, 2011 10:40AM

"తీన్ మార్" సినిమాని చూసిన ఇంతియాజ్ ఆలీ. ఇంతకీ ఈ ఇంతియాజ్ ఆలీ ఎవరు...? బాలీవుడ్ లో సైఫ్ ఆలీ ఖాన్, దీపిక పదుకునే హీరో, హీరోయిన్లుగా నటించగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం" లవ్ ఆజ్ కల్" సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన వ్యక్తి ఈ ఇంతియాజ్ ఆలీ. అతనికీ మన "తీన్ మార్" సినిమాకీ సంబంధం ఏమిటి...? ఈ "లవ్ ఆజ్ కల్" చిత్రాన్నే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో గణేష్ "తీన్ మార్" చిత్రంగా నిర్మించారు.

teen maar wallpapers, theen maar stills, teen maar iamges, theen maar pics, teen maar photos, theen maar pictures

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఈ "తీన్ మార్" చిత్రం మంచి హిట్ టాక్ తో విజయపథంలో నడుస్తూంది. ఈ "తీన్ మార్" చిత్రాన్ని చూసిన ఇంతియాజ్ ఆలీ సబ్ టైటిల్స్ లేకపోయినా "తీన్ మార్" చిత్రం తనకు బాగా అర్థమయ్యిందనీ, దర్శకుడు జయంత్ చిత్రాన్ని బాగా తీశారనీ, పవన్ కళ్యాణ్ నటన చాలా స్టైలిష్ గా ఉందనీ అన్నారు. తన సినిమా రీమేక్ ను చూసి ఇంతియాజ్ ఆలీ అభినందించటం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com