Home

»

Latest News

తీన్ మార్ తొలిరోజు కలెక్షన్ 9.45 కోట్లు

Apr 15, 2011 10:19AM

teena maar wallapapers, teena maar stills, teena maar images, teena maar pics, teena maar photos, teena maar pictures"తీన్ మార్" తొలిరోజు వసూలు 9.45 కోట్లు అని ఈ చిత్ర నిర్మాత గణేష్ తెలియజేశారు. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మించిన చిత్రం "తీన్ మార్". ఈ తీన్ మార్ తొలిరోజు 9.45 కోట్లు వసూలు చేసిందని రామానాయుడు స్టుడియోలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ చిత్ర నిర్మాత గణేష్ మీడియాకు తెలిపారు.

 

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్ని చిత్రాల్లోకీ ఈ "తీన్ మార్" తొలిరోజు వసూలు చేసిన 9.45 కోట్లు ఏ చిత్రం వసూలు చేయలేదనీ, ఇది తెలుగు సినీ పరిశ్రజ్మలోనే ఒక రికార్డనీ గణేష్ అన్నారు. ఇది "మగధీర" చిత్రం తొలి రోజు వసూలు చేసిన కలెక్షన్ల కన్నా ఎక్కువని సినీ వర్గాలంటున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవలసి ఉంది. "మగధీర" విడుదల చేసిన థియేటర్ల కన్నా"తీన్ మార్" విడుదల చేసిన థియేటర్లు ఎక్కువ. అందువల్ల "మగధీర" తొలిరోజు కలెక్షన్లను ఈ "తీన్ మార్" మూవీ తొలిరోజు కలెక్షన్లతో పోల్చలేము.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com