Home

»

Latest News

The Paradise: 'ది ప్యారడైజ్' సెకండ్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్.. 'ఆయా షేర్'ను మించి!

May 01, 2026

'దసరా' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేయగా, ఇప్పుడు సెకండ్ సింగిల్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ప్రేమ పాటకు ముహూర్తం:
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన "ఆయా షేర్.." అనే పాట మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు క్లాస్, యూత్‌ను ఆకట్టుకునేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. మే రెండో వారంలో ఈ సినిమా నుంచి రెండో గీతాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక మెలోడియస్ లవ్ ట్రాక్ అని సమాచారం. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బాణీలు కట్టిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై  నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. భారీ సెట్టింగ్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ చిత్రాన్ని ఆగస్టు 21న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. 'దసరా' మ్యాజిక్‌ను మించి ఈ ప్యారడైజ్ ఉంటుందని, నాని నటనలో మరో కోణాన్ని ఈ చిత్రం చూపిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com