Home

»

Latest News

Getup Srinu: మేము కాపులం.. ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను ఫైర్!

May 01, 2026

బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్న నటుడు గెటప్ శ్రీను (Getup Srinu) తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

గెటప్ శ్రీను ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి ఒక సరికొత్త వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు 'మేము కాపులం' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, యాంకర్ ఈ టైటిల్ గురించి ప్రస్తావిస్తూ.. "సినిమా కోసం కులాన్ని వాడుకోవడం నాకు నచ్చలేదు. ఇలాంటి టైటిల్స్ విషయంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది కదా?" అని ప్రశ్నించారు. 

ఈ వ్యాఖ్యలతో గెటప్ శ్రీను అసహనానికి లోనయ్యారు. "ఆ టైటిల్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. కథకు తగ్గట్టుగానే ఆ పేరు పెట్టాం తప్ప, కేవలం వివాదం కోసం కులాన్ని వాడుకోలేదు" అని వివరించారు. అయినప్పటికీ యాంకర్  తన వాదనను కొనసాగిస్తూ, గతంలో రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు కూడా ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. దీనికి శ్రీను సీరియస్ అవుతూ.. "తొక్కలో ఇంటర్వ్యూ" అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

గెటప్ శ్రీను ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన స్టంట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com