
అందరి ఊహలని తలకిందుకులు చేస్తూ ది ప్యారడైజ్ 200 కోట్ల క్లబ్ లోకి చేరినట్టు రీసెంట్ గా చిత్ర బృందం ప్రకటించింది. ఇక ప్యారడైజ్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ అత్యంత భారీ ధరకు కైవసం చేసుకుంది. సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ అయిన 6 నుంచి 8 వారాల విండో నిబంధన ప్రకారం, ఈ చిత్రాన్ని నవంబర్ మొదటి వారం లేదా అక్టోబర్ చివరి వారంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి: ఇంకో ఈవీవీ సత్యనారాయణ పుట్టడం సాధ్యమేనా:నవ్వుల సామ్రాజ్యానికి చక్రవర్తి

ఓటీటీ ప్రేమికులకు మరో సర్‌ప్రైజింగ్ న్యూస్ ఏమిటంటే, నిడివి కారణాల వల్ల థియేటర్లలో తొలగించిన పవర్‌ఫుల్ ‘దేశం’ పాటను డిజిటల్ వెర్షన్‌లో జోడించనున్నట్లు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పష్టం చేశారు. వెండితెరపై మిస్ అయిన ఈ గూస్‌బంప్స్ సాంగ్ చేరిక ఓటీటీ వీక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు, అలాగే మళ్లీ హోమ్ స్క్రీన్‌పై అనుభవించాలనుకుంటున్న అభిమానులు నవంబర్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఈ డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
[The Paradise Ott Release Date, Nani The Paradise OTT release, The Paradise Netflix streaming date, Nani Paradise movie OTT update]






