Home

»

Latest News

హీరోయిన్‌ని బీట్ చేసేలా ఉందిగా: ప్యారడైజ్‌లో నాని యంగ్ మదర్‌గా కనిపించిన బ్యూటీ ఎవరంటే!

Sep 25, 2026 4:24PM


ప్యారడైజ్ థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. నాని కూడా ప్యారడైజ్ భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లోనే ఉందనే అర్ధంలో ట్వీట్ చేసాడు. ఇక మూవీ చూసిన వాళ్ళందరూ యంగ్ నాని మదర్‌గా నటించి, తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ నటి ఎవరనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

యంగ్ నాని మదర్ గా కనిపించిన  భామ పేరు లావణ్య సహుకర. స్క్రీన్‌పై చాలా తక్కువ సమయం కనిపించినప్పటికీ, తన పవర్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్, నటనతో ఆకట్టుకుంది.  నిజానికి లావణ్య సహుకర ఇండస్ట్రీకి  కొత్త ఏమీ కాదు. 2019లో వచ్చిన 'ఉండిపోరాదే' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 'వాలెంటైన్స్ నైట్' వంటి చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 2023లో విడుదలై మంచి విజయం సాధించిన 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' చిత్రంలో హీరో చైతన్య రావు సరసన కథానాయికగా నటించింది. 2024లో విరాన్ ముత్తంశెట్టి సరసన 'ముఖ్య గమనిక' చిత్రంలో హీరోయిన్‌ కూడా ఆమెనే.  'కాడాది', 'సమిధ' వంటి విభిన్న ప్రాజెక్టులలోనూ కీలక పాత్రలు పోషించింది. 


ఇది కూడా చదవండి: సితార, ధనుష్ మూవీ స్టార్ట్ అయ్యింది: విశ్వనాధ్ అండ్ సన్స్ ని మించి!

 

 


సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా నిత్యం ట్రెండీ లుక్స్‌తో రచ్చ చేసే ఈ భామ, గ్లామర్ పండించడంలోనూ అగ్ర కథానాయికలకు ఏమాత్రం తీసిపోదు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన లావణ్య, ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో టాలీవుడ్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్యారడైజ్"లో లభించిన ఈ అరుదైన అవకాశం ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తల్లి, కొడుకుల మధ్య ఉన్న గాఢమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పూర్తి 'సమ్మక్క' క్యారక్టర్ లో బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి కులకర్ణి నటించి మెప్పించారు.

 

[The Paradise Nani Young Mother Actress Lavannya, The Paradise Nani, Lavannya Sahukara,The Paradise Movie Cast, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com