
ఒకప్పుడు న్యాచురల్ స్టార్ నాని అంటే పక్కింటి అబ్బాయి తరహా పాత్రలు, క్లాస్ ఎంటర్టైనింగ్ మూవీస్ గుర్తుకొచ్చేవి. కానీ, 'దసరా' నుంచి రూట్ మార్చి తనలోని మాస్ అండ్ వయలెంట్ యాంగిల్ ను చూపిస్తున్నాడు. గత చిత్రం 'హిట్-3'లో నెక్స్ట్ లెవెల్ వయలెంట్ చూపించిన నాని, ఇప్పుడు 'ప్యారడైజ్'తో అంతకుమించిన విధ్వంసానికి రెడీ అయ్యాడు.
'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో రిపీట్ కావడంతో 'ప్యారడైజ్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడబోతున్న ఈ టైమ్ లో, అసలు ఈ సినిమాలో ఏముంది? సెన్సార్ సభ్యులను సైతం భయపెట్టిన ఆ ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్ కథేంటి? మోహన్ బాబు చేసిన ఆ భయానకమైన విలన్ రోల్ ఏ రేంజ్‌లో ఉండబోతోంది? పూర్తి ఇంటర్నల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
మొదటగా ఈ సినిమాకి వచ్చిన సెన్సార్ టాక్ చూస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతుంది. సినిమాలో ఉన్న కంటెంట్ యొక్క తీవ్రత దృష్ట్యా సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఇటీవల తెలుగు సినిమాల్లో రక్తపాతం, నరికివేతలు చాలా సహజమైపోయినా, ఈ సినిమాలో చూపించిన రా అండ్ రియలిస్టిక్ యాక్షన్ ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతోందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
ఈ 'ప్యారడైజ్' కథ వెనుక ఉన్న అసలైన నేపథ్యం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. దీనిని ఒక సాధారణ కమర్షియల్ మాస్ సినిమాగా చూస్తే పొరపాటే. ఇందులో 'జడల్' అనే విభిన్న పాత్రలో నాని కనిపిస్తున్నారు. పుట్టిన క్షణం నుంచే సామాజిక వివక్షకు గురై, తల్లి కడుపు నుంచి బయటపడగానే అనగదొక్కబడిన ఒక సామాన్యుడి ఆక్రోశం ఇది. అణచివేతకు గురైన ఒక సమూహానికి, ఒక నియంతృత్వ శక్తకి మధ్య జరిగే సుదీర్ఘ పోరాటమే 'ది ప్యారడైజ్'. కోకిల మీద కాకులు జరిపే తిరుగుబాటుగా దర్శకుడు ఈ అంశాన్ని సింబాలిక్‌గా చెప్పాడు. తమిళ చిత్రాల్లో తరచూ చూసే ఆత్మగౌరవ పోరాటాలు, వర్గ-కుల విప్లవ అంశాలను తెలుగు తెరపై ఒక భారీ కమర్షియల్ కాన్వాస్ మీద శ్రీకాంత్ ఒడెల ప్రెజెంట్ చేయబోతున్నారనేది ప్రధాన టాక్.
ఇది కూడా చదవండి: ప్యారడైజ్ ఉచకోత.. కలలో కూడా ఊహించని ఓపెనింగ్స్.!
నాని తనకి తాను దిష్టి తీసుకునే క్రమంలో శరీరం అంతా రక్తసిక్తం కావడం లాంటి గ్లింప్స్ దృశ్యాలే చెప్తున్నాయి, ఇది ఎంత రా అండ్ రగ్గడ్‌గా ఉండబోతోందో. అణచివేతకు గురైన ఒక సమూహం కోసం, తన నేల కోసం, ఆత్మగౌరవం కోసం ఒక వ్యక్తి చేసే రివోల్ట్ ఈ కథ.
ఈ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఈ సినిమాలో ఎంత క్రూరమైన క్యారెక్టర్ చేశారంటే.. ఇటీవల ఒక ఈవెంట్లో మాట్లాడుతూ "ఈ సినిమా చూశాక నన్ను చూసి మీరంతా భయపడతారు" అని స్వయంగా ఆయనే చెప్పారు. పాతకాలపు రఫ్‌నెస్, ఇప్పటి పాన్ ఇండియా బ్రూటాలిటీ కలిపితే మోహన్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
యాక్షన్ సీన్స్, నాని, మోహన్ బాబు పాత్రలు, మదర్ సెంటిమెంట్, అద్భుతమైన ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ అంతా కలిసి ఒక కల్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. మరి ఈ వయలెంట్ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
మీకు నచ్చవచ్చు:
'ప్యారడైజ్' సినిమా చూశాక నా దగ్గరకు రావడానికి కూడా భయపడతారు.!
'ప్రాణం ఖరీదు' సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.?
The Paradise Movie First Review, The Paradise Movie Review, Nani Paradise Review, Paradise First Review, The Paradise Movie, Nani Paradise Movie, Telugu Movie Review, Telugu Film News, Telugu News





