
'పెద్ది'తో తన కట్ అవుట్ రేంజ్ పెంచుకున్న రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీని సుకుమార్ తో చేస్తున్న విషయం తెలిసిందే. మామూలుగానే ఇద్దరి కాంబో అంటేనే ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అలాంటిది రంగస్థలం కూడా ఆ ఇద్దరి కాంబోలో వచ్చి విజయం సాధించడంతో ఇక ఏ స్థాయి అంచనాలు ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.
'RC17'గా పిలువబడుతున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 20న విజయదశమి దసరా శుభ ముహూర్తాన పూజా కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతోంది. ఈ మేరకు మేకర్స్ నే అధికారంగా ప్రకటించారు. ఇక రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్ నెల నుంచి పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ గ్రాండ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ని పాన్ ఇండియా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తోంది.

ఇది కూడా చదవండి: ది ప్యారడైజ్ థియేటర్స్ లో తెలంగాణ కమ్మటి సర్వపిండి: మైత్రి థియేటర్స్ లో వినూత్న ప్రయోగం
అయితే సుకుమార్ ఐకాన్ మూవీ పుష్ప సిరీస్ లా ఆర్ సి 17 కూడా రెండు పార్టులుగా ఉంటుందనే రూమర్లకు తెర దించుతూ కేవలం ఒకే భాగంలో రానుందని మేకర్స్ స్పష్టం చేశారు. చరణ్‌ని మునుపెన్నడూ చూడని ఒక అర్బన్, అల్ట్రా-స్టైలిష్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త అవతారంలో సుకుమార్ ప్రెజెంట్ చేయబోతున్నాడనే టాక్ నడుస్తోంది. దాదాపు 300 కోట్ల రూపాయల నుంచి 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
[Rc17 Pooja Ceremony Date, Ram Charan, Sukumar, RC17 Pooja Ceremony, Mythri Movie Makers, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





