
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'. దసరా తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఆయా షేర్ సాంగ్, ఇతర కంటెంట్ విశేషంగా ఆకట్టుకొని.. అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లే అప్డేట్ వచ్చేసింది.
'ది ప్యారడైజ్' సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిట్ లాక్ అయిందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్లంతా షాకింగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రతీ సీన్ చాలా గ్రిప్పింగ్‌గా వచ్చిందని, ఫస్ట్ హాఫ్ అవుట్‌పుట్ చూసి మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారని టాక్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వచ్చిందట. స్క్రీన్ ముందర కూర్చున్న ఆడియన్స్‌కి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం అంటున్నారు. ఆ ఎపిసోడ్ ను థియేటర్లు షేక్ అయ్యేలా డిజైన్ చేశారట.
ప్రస్తుతం మేకర్స్ దృష్టి అంతా సెకండాఫ్ ఎడిటింగ్ మీద ఉంది. త్వరలోనే సెకండ్ హాఫ్ ఎడిట్ కూడా లాక్ చేసి రఫ్ కట్ రెడీ చేయబోతున్నారు.
అంతేకాదు, ఈ వారంలోనే 'ప్యారడైజ్' నుంచి సెకండ్ సింగిల్ బయటకు రాబోతోందట. అది కూడా ఎలాంటి అనిరుధ్ మాస్ టచ్ లో ఉండే ఫోక్ సాంగ్. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్‌తో క్రేజ్ పెంచేసిన అనిరుధ్, ఈ సెకండ్ ఫోక్ ట్రాక్‌తో చార్ట్‌బస్టర్స్ రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అయ్యాడు.
The Paradise, Nani, Srikanth Odela, Anirudh






