Home

»

Latest News

హర్రర్ మూవీతో నిర్మాతగా మారనున్న నిత్యామీనన్.. హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

Aug 24, 2026 5:21PM

 

పాల కడలిని చిలికినప్పుడు సౌందర్యం అనేది కూడా పుట్టింది, ఆ సౌందర్యం పేరు నిత్యామీనన్ అని అభిమానులు నమ్ముతుంటారు. సెల్యులాయిడ్ పై తన పెర్ఫార్మ్ కూడా అదే విధంగా ఉండటం అభిమానుల నమ్మకానికి ఓటు వేసే పరిస్థితి. గ్లామర్ రోల్స్  కంటే కథకి, ,పెర్ ఫార్మెన్స్ కి ప్రాధాన్యం ఉండే కంటెంట్ బేస్డ్ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ  ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది.

 ఈసారి నిత్య  ఒక సరికొత్త ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కథతో థియేటర్లలో ప్రేక్షకులని  భయపెట్టడమే కాకుండా, థ్రిల్ చేయడానికి వస్తున్నారు. సౌత్ ఇండియా ప్రేక్షకులని  'యామిరుక్కా బయమే', 'కరుంగాప్పియమ్' వంటి హిట్ హారర్ చిత్రాలతో థ్రిల్లింగ్ అనుభూతిని అందించిన దర్శకుడు డీకే (Deekay), తన తదుపరి ప్రాజెక్ట్‌ని  నిత్యా మీనన్‌తో రూపొందించడానికి సిద్ధమయ్యాడు. వినోదం, థ్రిల్ సమపాళ్లలో మిళితం చేసే డీకే శైలికి, నిత్యా మీనన్ నటన తోడవుతుండటంతో ఈ మూవీపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఒక ఆసక్తికరమైన విశేషం దాగి ఉంది.  నిత్యా మీనన్ కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.దీంతో ఈ న్యూస్  టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.


 Also Read: రాకా vs టాక్సిక్ .. ఫ్యాన్స్ అంటుంది ఇదే 

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు వేగంగా శరవేగంతో ప్రారంభం కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది 2027 సమ్మర్ కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డీకే కథనంలో ఉండే హ్యూమర్, సస్పెన్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఫాంటసీ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇన్నాళ్లూ విభిన్నమైన పాత్రలతో అలరించిన నిత్యా మీనన్, ఫాంటసీ హారర్ జోనర్‌లో భయపెడుతూనే నిర్మాతగా 'డబుల్ ధమాకా' కాంబినేషన్‌తో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. 

Nithya Menon, Dk

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com