Home

»

Latest News

the odyssey: ది ఒడిస్సీ vs హైదరాబాద్.. షాక్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు!

Jul 20, 2026 10:40AM

 

ది ఒడిస్సీ vs హైదరాబాద్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ట్యాగ్  లైన్ ప్రధాన ఆకర్షణగా  కనిపిస్తుంది. ప్రధాన ఆకర్షణ అనే కంటే  ఒక రకంగా ది ఒడిస్సీ కి హైదరాబాద్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలోని సినిమా ప్రేమికులకి హాలీవుడ్ చిత్రాల పట్ల ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎపిక్స్‌తో తెరకెక్కిన అంతర్జాతీయ ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఒడిస్సీ'  కోసం రిలీజ్ కి ముందు నుంచే నగరంలోని సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతగానో నిరీక్షించారు. 


అయితే మూవీ రిలీజయ్యాక బాక్సాఫీస్ వద్ద ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాలీవుడ్ చిత్రాలని మాతృభాష తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ 'ది ఒడిస్సీ' చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లోని థియేటర్లలో తెలుగు వెర్షన్ వైపు ప్రేక్షకులు అసలు అడుగు పెట్టడం లేదు. నిన్న ఆదివారం వీకెండ్ అయినప్పటికీ మెజారిటీ థియేటర్లలో తెలుగు షోలకి బుకింగ్స్ చాలా డల్స్ గా ఉన్నాయి. నగరంలోని ప్రముఖ బుకింగ్ యాప్స్ విశ్లేషిస్తే ఒక షాకింగ్ విషయం బయటపడింది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఏఎంబీ సినిమాస్, పివిఆర్ ఐనాక్స్ వంటి టాప్ సినిమా హాళ్లలో ఇంగ్లీష్ వెర్షన్‌కు దాదాపు 85% నుండి 90% వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కానీ అదే సమయంలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రదర్శిస్తున్న స్క్రీన్లలో కేవలం 10% కంటే తక్కువ ఆక్యుపెన్సీ నమోదు కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. నగరంలోని ఐటి కారిడార్ పరిధిలో ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల నుండి దాదాపు 75% మంది యువత కేవలం ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌ని  సబ్‌టైటిల్స్‌తో చూడటానికే మొగ్గు చూపారు. సినీ అడ్డాగా భావించే ఆర్ టి సి క్రాస్ రోడ్ లో సైతం ఇదే పరిస్థితి.

 తెలుగు వెర్షన్‌ని ప్రేక్షకులు రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం డబ్బింగ్ క్వాలిటీ లోపించడమేనని టాక్ నడుస్తోంది. భారీ డైలాగులు, గ్రీకు పురాణ నేపథ్యం ఉన్న కథని  తెలుగులోకి అనువదించేటప్పుడు సహజత్వం లోపించిందని, డైలాగ్ డెలివరీ సరిగ్గా సింక్ కాలేదని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో హలీవుడ్ సినిమాల్లో ఉండే ఒరిజినల్ సౌండ్ ఎఫెక్ట్స్  థియేట్రికల్ అట్మాస్ఫియర్ ఆస్వాదించాలంటే ఇంగ్లీష్ వర్షనే కరెక్ట్ అని మెజారిటీ ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. దీనివల్ల హైదరాబాద్‌లోని దాదాపు 50 కంటే ఎక్కువ థియేటర్లలో తెలుగు వెర్షన్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. నిన్నటి ఒక్కరోజే తెలుగు షోల ద్వారా రావాల్సిన దాదాపు 15 లక్షల నుండి  20 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మల్టీప్లెక్స్ ప్రతినిధుల సమాచారం ప్రకారం, తెలుగు వెర్షన్‌కి డిమాండ్ లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఆ స్క్రీన్లను కూడా ఇంగ్లీష్ వెర్షన్‌గా మార్చాలని లేదా ఇతర ప్రాంతీయ సినిమాలకు కేటాయించాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకు నీరాజనాలు పట్టిన తెలుగు ఆడియన్స్, ఇప్పుడు క్వాలిటీ లేకపోతే ఎంత పెద్ద సినిమానైనా సున్నితంగా తిరస్కరిస్తారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఏదేమైనా 'ది ఒడిస్సీ' ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్ హైదరాబాద్‌లో దూసుకుపోతుంటే, తెలుగు డబ్బింగ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

the odyssey, the odyssey collections, hyderabad, Christopher Nolan


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com