Home

»

Latest News

The kerala story 2: సెకండ్ షో స్టార్ట్.. థియేటర్స్ లోకి వచ్చే పరిస్థితి ఉందా!

Feb 28, 2026


-రిలీజ్ పై స్టే ఇచ్చిన కేరళ హైకోర్ట్
-రంగంలోకి డివిజన్ బెంచ్ 
-సినీ అభిమానుల పడిగాపులకి ప్రతిఫలం

ఈ నెల 27 న విడుదల కావాల్సి ఉన్న 'ది కేరళ స్టోరీ  2(The Kerala Story 2) రిలీజ్ కి సెన్సార్ అనుమతి ఇవ్వడంపై హైకోర్టు మండిపడి రిలీజ్ పై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రియులు షాక్ కి గురయ్యారు. పైగా తదుపరి విచారణని 15 రోజుల పాటు హోల్డ్ లో ఉంచడంతో సినీ ప్రియుల నిరాశ నిస్పృహలకి అంతే లేకుండా పోయింది. వాయిదా పడిన సినిమాల విషయంలో ప్రస్తుత సినీ వాస్తు కూడా అంతగా బాగోక పోవడంతో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు సినీ ప్రియులకి గుడ్ న్యూస్.

కేరళ స్టోరీ పార్ట్ 2 రిలీజ్ కి కేరళ డివిజన్ బెంచ్ అనుమతి ఇవ్వడంతో నిన్న సెకండ్ షో నుంచి థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. దీంతో సినీ ప్రియులు భారీగానే థియేటర్స్ కి పోటెత్తారు. కాకపోతే తెలుగు వెర్షన్ ఉంటుందని మేకర్స్ గతంలో  అధికారకంగా చెప్పినా ప్రస్థుతానికి పాన్ ఇండియా వ్యాప్తంగా హిందీ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యింది. మరి తెలుగులో కూడా వస్తుందేమో చూడాలి.

Also read: Shalini Pandey: అర్జున్ రెడ్డి భామ షాలిని వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి.. ఇష్టం ఉందంటారా లేక

ముగ్గురు యువతులు తమ తల్లితండ్రుల మాటని పెడచెవిన పెట్టి ప్రేమ పేరుతో వేరే మతానికి చెందిన అబ్బాయిలని పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ తర్వాత తాము మోసపోయామని గ్రహించి ముగ్గురు యువకుల వల్ల చిత్ర హింసలు అనుభవిస్తారు.ఈ క్రమంలో చివరకి ఆ ముగ్గురు యువతుల జీవితాలు ఎలా ముగిశాయనే పాయింట్ తో కేరళ స్టోరీ పార్ట్ 2 తెరకెక్కింది. 2023 లో సంచలన విజయాన్ని అందుకున్న కేరళ స్టోరీ కి సీక్వెల్ గా తెరకెక్కగా,ప్రెజెంట్ థియేటర్స్ దగ్గర పాజిటివ్ టాక్ రన్ అవుతున్నట్టుగా బాక్స్ ఆఫీస్ టాక్.  


     

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com