
సినిమా... ఇది ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి లైఫ్ లో బాగుపడే మెసేజ్ కూడా ఇస్తుంది. ఇవన్నీ సినిమా మనకి అందించాలంటే ఎంతో మంది రేయింబవళ్ళు కష్టపడాలి. పెపైచ్చు చాలా ఖరీదైన వ్యాపార సామ్రాజ్యం అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
తాజాగా ENE రిపీట్ 2 దర్శకుడు తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూ లో తన సినీ ప్రయాణం, ఎదురుచూపులు, ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సవాళ్లు మరియు విజయాల వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలను పంచుకున్నారు. కేవలం సాధారణ చిత్రాలు కాకుండా, నేటి యూత్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త కథలతో ముందుకు వెళ్తున్న తరుణ్ భాస్కర్ ఆలోచనల వెనుక పెద్ద కష్టమే దాగుంది.
ఒక సాధారణ షార్ట్ ఫిలిం మేకర్‌గా కెరీర్ ప్రారంభించి, ఇండస్ట్రీలో ఎవరి సహాయం లేకుండా తన ప్రతిభను నమ్ముకుని అడుగుపెట్టిన ఆయన ప్రయాణం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. మొదటి సినిమా 'పెళ్లిచూపులు'తోనే నేషనల్ అవార్డులు సాధించి టాలీవుడ్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా యూత్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.

ఇది కూడా చదవండి: నయనతారకి షాక్ లపై షాక్‌లు.. క్రేజ్ ఉంది కానీ...!
చిత్రాల రూపకల్పనలో ఆయన పడిన కష్టం, నటీనటుల ఎంపికలో ఆయన అనుసరించిన విధానం ఇంటర్వ్యూలో హైలైట్‌గా నిలిచాయి. పరిశ్రమలో తనకంటూ ఒక జోనర్ సృష్టించుకోవడానికి ఆయన ఏకంగా వందల గంటల స్క్రిప్ట్ వర్క్ మరియు గ్రౌండ్ రీసెర్చ్ చేసినట్లు తెలిపారు.
సినిమా రంగంలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికీ తరుణ్ భాస్కర్ ప్రయాణం ఒక చక్కటి పాఠం. కేవలం కమర్షియల్ హంగుల వెళ్లకుండా, సహజమైన పాత్రలు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే సంభాషణలతో సినిమాలను ఎలా తెరకెక్కించవచ్చో ఆయన నిరూపించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి కూడా మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు కోరుకునే విభిన్నమైన జోనర్లను టచ్ చేస్తూనే, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

వెంట వెంటనే సినిమాలు తెరకెక్కించడానికి సినిమా అనేది సబ్బుల వ్యాపారం కాదు కదా! టాలీవుడ్ భవిష్యత్తును మార్చడంలో యువ దర్శకుల పాత్ర ఎంత కీలకమో ఆయన తన అనుభవాల ద్వారా పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సినిమా వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ENE రిపీట్ 2 ఈ నెల 19 న విడుదల కాబోతుంది.
మీకు నచ్చవచ్చు : ఆ హీరో స్టార్ పవర్ అదుర్స్!
[Tharun Bhascker Exclusive Interview, Tharun Bhascker, Telugu360 exclusive, Tollywood director, Pelli Choopulu, Ee Nagaraniki Emaindhi, Telugu cinema interview, Telugu cinema news,Telugu Cinema News, Latest Telugu Film News, TeluguOne Cinema News, TeluguOne Film News, TeluguOne]




