Home

»

Latest News

Thaman: థమన్ మామూలోడు కాదో భయ్యో.. పట్టి పడేసాడు

May 02, 2026

 

విక్టరీ వెంకటేష్(Venkatesh),త్రివిక్రమ్(Trivikram)కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ఉరఫ్ ఏకే 47(Ak 47)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అమ్మని ఆవకాయని ఎలా అయితే మర్చిపోమో, ఏకే 47   ని కూడా తెలుగు ప్రేక్షకులు మరిచిపోకుండా చేయాలనే పట్టుదలతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఆ పట్టుదలని నిజం చేసే బాధ్యతని థమన్(Thaman)కూడా తీసుకున్నాడు. 

కొన్ని రోజుల నుంచి  ఏకే 47 కి థమన్ మ్యూజిక్ ని అందించబోతున్నాడనే న్యూస్ సినీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పుడు ఆ న్యూస్ కి తధాస్తు దేవతలు తధాస్తు అనేసారు.త్రివిక్రమ్ తో కలిసి ఉన్న ఒక  పిక్ ని థమన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి  ఆదర్శ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చానని  తెలిపాడు. ఏకే 47 లో మొదటి సంగీత దర్శకుడు  యానిమల్ ఫేమ్  హర్షవర్ధన్ రామేశ్వర్.


also read: Bellamkonda sai sreenivas: నా పెళ్ళాం నిప్పురా అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్  

మరి ఏకే 47 కి థమన్ అల వైకుంఠ పురం రేంజ్ లో ట్యూన్స్ ఇచ్చి త్రివిక్రమ్ ని ఖుషి చేస్తాడేమో చూడాలి. వెంకటేష్  తో మాత్రం మూడో మూవీ. షాడో, వెంకీ మామకి థమనే.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com