Home

»

Latest News

Bellamkonda sai sreenivas: నా పెళ్ళాం నిప్పురా అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 

May 2, 2026 5:39PM

 


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాచులర్ లైఫ్ కి ఎండ్ కార్డు ఇచ్చేసి కావ్యరెడ్డితో ఇక నేను నీ మొగుడ్ని అని చెప్పిన విషయం తెలిసిందే. బెల్లంకొండ కూడా కళ్ళు తెరిచే మూసే లోపే 
తిరుమల తిరుపతి ఏడుకొండల వాడి పాదాల దగ్గర పెళ్లి, హైదరాబాద్ లో రిసిప్షన్ చక చక జరిగిపోయాయి. సోషల్ మీడియా కూడా ఆ వేడుక చకచకా అయిపోయిందని డల్ గా ఉన్న సమయంలో బెల్లంకొండ చేసిన నా పెళ్ళాం నిప్పురా పోస్ట్ సోషల్ మీడియాని కళకళ లాడేలా చేస్తుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

 బెల్లంకొండ రీసెంట్ గా ట్విట్టర్ లో కావ్యరెడ్డిని పరిచయం చేస్తూ ‘నా పెళ్ళాం నిప్పురా' అనే పోస్ట్ చేసి పెళ్లి ఫోటోలు షేర్ చేసాడు. దీంతో  ఎందుకు అలా పోస్ట్ చేసాడో అనేది కొంత మందికి అర్ధం కాలేదు. తాను నటించిన జయ జానకి నాయక మూవీలో నటుడు జయప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్ ,శ్రీనివాస్ పై ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. జయప్రకాశ్ కూతురుగా రకుల్ కనిపించింది. సదరు సీన్ యొక్క ఉదేశ్యం ప్రకారం  రకుల్ ప్రీత్ సింగ్ ని ఉద్దేశిస్తూ  నీ కూతురు నిప్పురా అనే  డైలాగ్ ని బెల్లకొండ చెప్తాడు. ఆ డైలాగ్ నే పోస్ట్ చేసి    మంచి ఫన్ ని క్రియేట్ చేసాడు.  

Also read: Kiara Advani: యష్ తో చేసిన ఆ బోల్డ్ సీన్స్ తొలగించండి.. కియారా రిక్వెస్ట్! 

 

    

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com