Home

»

Latest News

తప్పేవరిది: ఉదయభానుదా..? సునీతదా..?

Oct 21, 2016 11:11AM

బుల్లితెరపై టాప్ యాంకర్ ఉదయభాను, అలాగే లీడింగ్ సింగర్ సునీత ఇద్దరూ రెండు వేర్వేరు రంగాలకు చెందిన వారు. ఒకరితో ఒకరికి ముఖపరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ మధ్య ఓ దినపత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా సునీత పేరు ప్రస్తావించకుండా ఒక మాట చెప్పింది భాను. అమెరికా టూర్‌లో తనను ఓ సింగర్ అవమానించిందని, తనను కనీసం స్టేజ్‌ మీదకు కూడా పిలవలేదని..తనంతట తాను వెళ్తుంటే ఆమె ట్రూప్ శాడ్ మ్యూజీక్ ప్లే చేశారని చెప్పింది. దాంతో తనకు ఏడుపు కూడా వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆ ఇంటర్వ్యూని పేపర్లో చదివిన సునీత జరిగిన దానిపై క్లారిటీ ఇచ్చింది.

నా పేరు డైరెక్ట్‌గా చెప్పకపోయినా..ఆమె చెప్పింది నా గురించే అని అర్థమైంది. నిజానికి తను నన్నుఅపార్థం చేసుకుంది. భానును నిర్వాహకులు పిలిచారు..నేను పిలవలేదు. కాబట్టి ఆమెను స్టేజ్ మీదకు రమ్మని నేనేందుకు చెబుతాను..? ఇక నా మ్యూజిక్ టీమ్ ఆమె వస్తున్నప్పుడు ఏదో శాడ్ సాంగ్ వాయించారని చెప్పింది. నాకు ఆ విషయం గుర్తులేదు. కానీ ఆ తరువాత నేను ఉదయభానుని చాలాసార్లు పలకరించానని ఆమె వైపు నుంచి స్పందన లేదని చెప్పింది. ఇక్కడ సునీత పిలవకపోవడం నిజమే...భాను హర్టవ్వడం నిజమే..ఇక్కడ ఇద్దరి తప్పు లేదు..కాబట్టి తప్పు ఎవరిది అని ఎవరికి వారు నిర్థారించుకోవాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com