Home

»

Latest News

అనుష్క పేరు వెనుక..?

Oct 21, 2016 11:06AM

అనుష్క...సౌత్‌లో క్రేజీ హీరోయిన్. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధం గడుస్తున్నా..తనతో పాటు వచ్చిన తారలు ఫేడవుట్ అవుతున్నా..ఎన్ని కొత్త అందాలు వచ్చినా అనుష్క ప్లేస్ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ ఆమె నటిస్తాను అని ఓకె చెప్పాలే కానీ, ఆమెను ఎంచుకునే నిర్మాతలకు, దర్శకులకు, అంతకు మించి హీరోలకు కొదవలేదు. అయితే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పేర్లు ఒరిజినల్ పేర్లు కానట్లే అనుష్కది కూడా అసలు పేరు కాదు. ఆమె ఒరిజినల్ నేమ్ స్వీటీశెట్టి. అనుష్క అనే పేరు పెట్టుకోవడానికి ఆమె చాలా కష్టపడిందట.

సినిమా కోసం స్వీటీ అని కాకుండా మరొక పేరేదైనా పెట్టుకొమని చెప్పినపుడు, మంచి పేరు కావాలని ఎన్నో పేర్ల పుస్తకాలు తిరిగేస్తే, చివరికి అనుష్క అనే పేరు కుదిరింది. అయితే కొత్తలో అనుష్క అని పిలిస్తే తనను కాదు అనుకునేదట..పైగా ఆ మాట సెట్‌లో మాత్రమే వినిపించేదట. పేరు వినిపించగానే మేకప్ సరిచేసుకుని కెమెరా ముందుకు వెళ్లడానికి సిద్ధమైపోయేదట. దాంతో ఆ పేరు పెట్టి ఎవరైనా పిలిస్తే సెట్‌లో పని కోసమే అన్న ముద్ర పడిపోయిందట. ఇప్పటికీ కూడా అలాగే అనిపిస్తుందని గత జ్ఞాపకాలు చెప్పుకొచ్చింది జేజేమ్మ. సో అనుష్క అన్న పేరు వెనుక అంత కథ ఉందన్న మాట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com