Home

»

Latest News

హీరోల వల్ల ఉపయోగమేంటి.. ఏం చేస్తున్నారు!

Aug 10, 2026 7:57PM

 

 

హీరో.. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకొని ఉంటే గాని హీరో అవ్వరు అనే సామెత అభిమానుల్లో, సినీ ప్రియుల్లో చాలా బలంగానే ఉంది. యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల జోనర్స్ లో నవరసాలని ప్రదర్శిస్తూ అభిమానులు, ప్రేక్షకులని అలరించడమే ద్యేయంగా ఉంటాడు. అసలు నవరసాలు ప్రదర్శించాలంటే నరాలు తెగిపోతాయి. నటన అనేది అంత కష్టం.  తాజాగా ఫిలిం సర్కిల్స్ లో ప్రజలు డబ్బుతో సినిమా టికెట్ కొంటేనే హీరోలకి డబ్బులు అనే చర్చ జరుగుతుంది. దీంతో ఈ విషయంపై అభిమానులు, సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

వాళ్లంతా మాట్లాడుతు హీరోలకి ప్రజలు సినిమా చూస్తేనే డబ్బులు వస్తాయనేది నిజం. ఈ విషయంలో సినిమానే కాదు. ఆటో నడుపుకునే వ్యక్తి దగ్గర నుంచి అంబానీ దాకా ప్రతి వ్యక్తి సంపాదన ఇంకో వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆ గవర్నమెంట్ ని నడిపే రాజకీయనాయకుడు అందరు ప్రజలు కట్టిన   పన్నునే జీతాలుగా తీసుకుంటారు. మరి ఆ అందరకి హీరోకి ఉన్న తేడా ఏంటంటే తమ ప్రజలకి ప్రకృతి విపత్తు సంభవించి బాధపడుతుంటే వెనక, ముందు చూడకుండా కోట్ల రూపాయల డబ్బులని ఇస్తున్నారు. ఎంతలా అంటే వెన్నెముఖ లేనంతగా..  


Also Read: పాలిటిక్స్ ఖాయమా!: జార్ఖండ్ విద్యార్థులకి అండగా పుష్ప


ఇక హీరోల పుట్టిన రోజులతో పాటు సినిమా రిలీజ్ రోజు, రికార్డు కలెక్షన్స్ సాధించినప్పుడు అభిమానులు చేసే సేవాకార్యక్రమాలు అయితే నభూతో నభవిష్యత్. మరి దీన్ని బట్టి హీరోలు ప్రజల ద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ప్రజలకే ఇస్తున్నారు. ఈ విషయంలో దర్శకులు, నటులు, హీరోయిన్స్, నిర్మాతలు కూడా పోటీ పడుతూ కోట్ల రూపాయల డబ్బుని అందచేస్తున్నారు. కాబట్టి సినిమా వాళ్ళు ఉన్నది ప్రజల కోసం, ప్రజలు ఉన్నది సినిమా వాళ్ళ కోసమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రియులు స్పందిస్తున్నారు.

Hero, Chirnajeevi, Balakrishna, Nagarjuna, Ntr, Pawan kalyan
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com