Home

»

Latest News

ప‌ని మ‌నిషిని కెలికితే ఇంతే మ‌రి!

Oct 10, 2016 4:59PM

పాపం పృద్వీ టైమ్ బాగాలేదు. కెరీర్ ప‌రంగా సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లా దూసుకుపోతున్నా... వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు చికాకు పెడుతున్నాయి. మ‌నోడికి బాల‌య్య ఫ్యాన్స్ ఆల్రెడీ యాంటీ అయ్యారు. అస్త‌మానూ బాల‌య్య డైలాగుల్ని పేర‌డీ చేసి చేసీ విసుగు తెప్పించాడు. దాంతో ఫృద్వీకి నంద‌మూరి ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చేంత వ‌ర‌కూ వెళ్లింది ప‌రిస్థితి. ఇప్పుడు ఓ మ‌హిళ‌ని మోసం చేశాడంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోద‌య్యింది. స‌ద‌రు మ‌హిళ‌... ఫృద్వీ ఇంట్లో ప‌నిమ‌నిషిగా ప‌నిచేసింద‌ట‌. ఆ స‌మ‌యంలో ఏదో గ‌డ‌బిడ అయ్యి... ఫృద్వీ ఆమెను ప‌నిలోంచి తొల‌గించాడ‌ట‌.

రెండు నెల‌ల క్రితమే ఆ ప‌ని మ‌నిషి ''న‌న్ను మోసం చేశావ్‌.. , నీపై కేసు పెడ‌తా'' అంటూ బెదిరిస్తోంద‌ని స‌మాచారం. మ‌ధ్య‌వ‌ర్త‌ల ద‌గ్గ‌ర కూర్చుని, కొంత మొత్తం సెటిల్ చేసి ఆ కూపం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడ‌ట ఫృద్వీ. అయితే.. ఇచ్చిన ఎమౌంట్ క‌ళ్ల‌కు ఆన‌లేదేమో??  వాళ్లు మ‌ళ్లీ రివ‌ర్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. అందుకే.. ఇప్పుడు వ్య‌వ‌హారం పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కూ వెళ్లింద‌ని స‌మాచారం. ఇప్పుడు కూడా ఫృద్వీ సామ‌ర‌స్యంగానే ప‌రిష్క‌రించుకోవాల‌ని, గోటితో పోయే వ్య‌వ‌హారం గొడ్డ‌లి వ‌ర‌కూ తీసుకురాకూడ‌ద‌ని ఫృద్వీ భావిస్తున్నాడ‌ట‌.  కెరీర్ మంచి ఊపులో ఉన్న‌ప్పుడు ఇలాంటి చిల్ల‌ర వ్య‌వ‌హారాలెందుకు? అల్ల‌రిపాలు కావ‌డానికి త‌ప్ప‌. ఈ విష‌యాన్ని ఫృద్వీ ఎప్పుడు తెలుసుకొంటాడో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com