Home

»

Latest News

టీజ‌ర్ రివ్యూ :  ధృవ‌

Oct 12, 2016 10:32AM

 

ఈ ద‌స‌రాకి త‌న టీజ‌ర్‌తో మ‌రింత స‌ర‌దాలు పెంచాడు రామ్‌చ‌ర‌ణ్‌. త‌మిళంలో విజ‌యం సాధించిన త‌ని ఒరువ‌న్‌ని రామ్ చ‌ర‌ణ్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ద‌స‌రా సంద‌ర్భంగా టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. 40 సెక‌న్ల ఈ టీజ‌ర్ క‌చ్చితంగా రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కి న‌చ్చుతుంది. నీ స్నేహితుడు ఎవ‌రో తెలిస్తే నీ క్యారెక్ట‌ర్ తెలుస్తుంది... అంటూ చ‌ర‌ణ్ వ‌దిలిన ఒక్క డైలాగ్ ధృవ క‌థాగ‌మ‌నాన్ని చాటి చెబుతుంది.  టీజ‌ర్ ఆసాంతం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు, స్టైలీష్ మేకింగ్‌కి నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఈ క‌థ‌కు సురేంద‌ర్ రెడ్డిని ఎందుకు తీసుకొన్నారో.. టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. షాట్స్‌, దానికి ఇచ్చిన ఆర్‌.ఆర్‌... అన్నీ ఆహా అనిపించేలానే ఉన్నాయి. ఈమ‌ధ్య విడుద‌లైన స్టైలీష్ టీజ‌ర్ల‌లో ఇదొక‌టి అని నిస్సందేహంగా చెప్ప‌వొచ్చు. త‌ని ఒరువ‌న్‌ క‌థ‌, స్క్రీన్ ప్లే గొప్ప‌గా ఉంటాయి. దానికి సురేంద‌ర్ రెడ్డి స్టైల్‌నీ, గీతా ఆర్ట్స్ మేకింగ్ వాల్యూస్ ని జోడించిన‌ట్టు తెలుస్తూనే ఉంది.కాక‌పోతే రామ్‌చ‌ర‌ణ్ గొంతే మ‌రీ వీక్‌గా ఉంది. డైలాగులు ప‌లికేట‌ప్పుడు చ‌ర‌ణ్ ఇంత అశ్ర‌ద్ద‌గా ఎలా ఉంటాడో?  ఇంటెన్సిటీ ఉన్న డైలాగ్‌.. పైగా టీజ‌ర్లో ఒకే ఒక్క డైలాగ్‌.. దాన్ని ప‌లికేట‌ప్పుడు ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండాలి?  ఈ ఒక్క‌లోటు మిన‌హాయిస్తే.. ధృవ టీజ‌ర్ సూప‌రో.. సూప‌ర్‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com