Home

»

Latest News

30 ప్లస్‌లో చూపిస్తున్న నిత్య

Sep 7, 2016 1:16PM

కొందరికి అందం ఉంటే అభినయం ఉండదు..మరికొందరికి అభినయం ఉంటే అందం ఉండదు. కాని ఈ రెండు కలబోసిన బొద్దుగుమ్మ నిత్యామీనన్. అలా మొదలైందితో తెలుగు వారికి పరిచయమై టాలెంటెడ్ నటిగా గుర్తింపు పొందింది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చాలా మంది కథానాయకలకు ఈ అమ్మడు పూర్తి విరుద్దం. తన మనసుకు నచ్చిన సినిమాలు చేస్తాను..ఎక్స్‌పోజింగ్‌ చేయను అనే నిబంధనను విధించుకుని నచ్చే సినిమా వచ్చే వరకు ఖాళీగా ఉండటానికైనా ఇష్టపడుతుంది కాని మనస్సాక్షికి విరుద్దంగా వెళ్లనని నిరూపించుకుంది. అయితే ఇదంతా గతం ఇప్పుడు మాత్రం ఈ నిబంధనకు సవరణ చేసింది నిత్య. ఇక నుంచి కొద్దిపాటి ఎక్స్‌‌పోజింగ్‌కు నిత్య గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందట. అలాగే నచ్చిన కథలే చేస్తాను అని అనకుండా తన దగ్గరికి వచ్చిన కథల్లో కొద్దిగా బాగున్నాసరే చేస్తానని అంటోందట. ఈ మార్పుకు కారణం ఒక్కటే..వయసు. ఇప్పటికే 30 ప్లస్ స్టేజ్ దాటిపోవడంతో పాటు కుర్ర హీరోయిన్లు దూసుకువస్తుండటంతో నిత్య పద్ధతి మార్చుకుందని టాక్. ఏదైతేనేం నిత్యని తమ సినిమాల్లో మిస్సయిన వాళ్లంతా ఇప్పుడు ఈ వార్తతో తిరిగి ఆమె చుట్టూ చక్కర్లు కొట్టేందుకు రెడీ అవుతున్నారట.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com